ETV Bharat / city

ఆలయాలపై వరుస దాడులకు కారణమేంటి ? అసలేం జరుగుతోంది..! - ఏపీలో ఆలయాలపై వరుస దాడులు

రాష్ట్రంలోని ఆలయాల్లోని దేవతామూర్తుల విగ్రహ ధ్వంసాలు ఆగడం లేదు. పవిత్ర దేవాలయాలపై దాడులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఆస్తుల అపహరణకు అడ్డుకట్ట లేకుండాపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం తాము కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించినా.. ఇంతవరకు ఒక్క ఘటనలోనూ బాధ్యుల గుర్తింపు జరగలేదు. దాడుల అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా.. రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ప్రతిపక్షాలంటున్నాయి. అంతర్వేదిలో ఆలయ రథానికి నిప్పు నుంచి రామతీర్థంలో రాముని విగ్రహ తల ఛేదనం వరకు...ఆ తర్వాత జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు ఆలయాలపై దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుంది?

attacks on temples in andhrapradesh
attacks on temples in andhrapradesh
author img

By

Published : Jan 3, 2021, 8:44 PM IST

అందరినీ రక్షించేవాడు దేవుడని భక్తుల విశ్వాసం. అందరూ తమ రక్షణ, కష్టాలు తీర్చమని ఆలయాలకు వెళ్తుంటారు. అలాంటిది ఇప్పుడు ఆలయాల్లోని దేవతామూర్తులు, ఆస్తులను కాపాడుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న వరుస సంఘటనలు చూసి భక్తులు తీవ్ర కలవరానికి గురవుతున్నారు. రాష్ట్రంలో గతంలోనూ ప్రాచీన దేవాలయాలు, పవిత్ర విగ్రహాలకు అపచారం వాటిల్లింది. గుప్త నిధుల అన్వేషణ, స్మగ్లింగ్‌ అవసరాల కోసం ఆయా ఘటనలు అప్పట్లో జరిగాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు.. అలాంటి ప్రయోజనం కోసం కాదనేది స్పష్టంగా కనిపిస్తోంది.

గతేడాది జనవరిలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పలు హిందూ దేవుళ్లు, దేవతల విగ్రహాలు ధ్వంసమయ్యాయి. ఫిబ్రవరి నెలలో నెల్లూరు ప్రసన్న వెంకటేశ్వరస్వామి దేవాలయ రథం దగ్ధమైంది. ఆ తర్వాత అనేక చిన్న ఆలయాల్లో ఈ తరహా ఉదంతాలు జరిగాయి. సెప్టెంబరు నెలలో కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మక్కపేట దగ్గరిలోని కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయం నంది విగ్రహం ధ్వంసమయ్యింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం అగర మంగళం అభయాంజనేయస్వామి దేవాలయంలోని నంది విగ్రహం ధ్వంసం జరిగింది. అదే నెలలో తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ రథం దగ్ధం పెను వివాదానికి కారణమైంది. ఈ ఘటనపై అధికారపక్షం మినహా అన్ని రాజకీయ పార్టీలు, హిందూ ధార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. చివరికి రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశిస్తామంటూ కేంద్రానికి లేఖ రాయడంతోనే సరిపుచ్చింది. దగ్ధమైన రథం స్థానంలో కొత్త రథం నిర్మాణం చేయిస్తోంది. ఇంతవరకు ఈ ఘటనలో బాధ్యులు ఎవరనేది తేల్చలేదు. విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాలను వేసినా పురోగతి కనిపించలేదు. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం దగ్గర ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం అయింది. కృష్ణాజిల్లా నిడమానురులోనూ సాయిబాబా విగ్రహం ధ్వంసం జరిగింది.

ఎవరి పని..ఎందుకు జరుగుతున్నాయి..?

విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయ ఉత్సవ రథానికి చెందిన మూడు వెండి సింహం విగ్రహాలు మాయమయ్యాయి. 2020 ఏడాది చివరిలో విశాఖ జిల్లా పాడేరు ఘాట్‌లో అమ్మవారి విగ్రహం పాదాలను ధ్వంసం చేశారు. తాజాగా ఆంధ్ర భద్రాద్రిగా పేరొందిన ఉత్తరాంధ్ర జిల్లాలోని ప్రఖ్యాత రామతీర్థం ఆలయంలోని శ్రీరాముడి విగ్రహం తల నరికివేత ఇప్పుడు పెను సంచలనమైంది. అంతకుముందు తర్వాత కూడా ఈ తరహా ఘటనలు ఆగడం లేదు. ఈ ఏడాది ప్రారంభంలోనే తూర్పుగోదావరి జిల్లా రామమహేంద్రవరంలోని శ్రీరాంనగర్‌లోని విఘ్నేశ్వర ఆలయంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం రెండు చేతులు విరిచేయడం భక్తులను కలవరపెడుతోంది. విజయవాడలో సీతారామమందిరంలో సీతమ్మ విగ్రహం ధ్వంసం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు చేస్తున్నారు? ఆకతాయిలా..? మతిస్థిమితం లేని వ్యక్తులా..? ఓ పని కట్టుకుని చేస్తోన్న ప్రత్యేక ముఠాలా.. ? ఈ ప్రశ్నలకు దర్యాప్తు సంస్థల నుంచి సమాధానం లేదు. అనుమానితుల పేరిట అనేకమందిని అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారణ సాగిస్తున్నా వారికి ఆధారాలు లభించడం లేదు.

భాజపా-జనసేనల సంయుక్త పోరాటం...

భాజపా నేత సునీల్ దేవధర్

విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత రామతీర్థం ఆలయంలో శ్రీరాముడి విగ్రహం తల నరికేసిన ఘటనలో... స్వామి ఒంటి మీది వెండి ఆభరణాల జోలికి పోలేదు. ఆయన తలను విగ్రహం నుంచి తొలగించి అక్కడే ఉన్న కోనేరులో పడేశారు. ఈ ఒక్క ఘటనలోనే కాదు.. రాష్ట్రంలో ధ్వంసానికి సంబంధించి వెలుగులోకి వస్తున్న అన్ని ఉదంతాల్లోనూ జరిగింది ఇదే. దీన్నిబట్టి ఈ పనులు చేస్తున్నవారి ఉద్దేశ్యం సుస్పష్టంగా కనిపిస్తోందని భక్తులు, హిందూ సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆలయాలపై జరుగుతున్న దాడుల పట్ల భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్​ఛార్జ్ సునీల్ దేవధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలన నుంచి సీఎం జగన్ తప్పుకోవాలన్నారు. వైకాపా ప్రజాప్రతినిధుల్లో హిందువులు లేరా..? అని ప్రశ్నించారు. భాజపా, జనసేన సంయుక్తంగా ఆందోళనలు చేపట్టింది. ఈనెల ఐదో తేదీన రామతీర్థం మహాపాదయాత్రకు పిలుపునిచ్చింది.

సీబీఐ దర్యాప్తునకు డిమాండ్...

తెదేపా అధినేత చంద్రబాబు

ప్రశాంత వాతావరణం, మత సామరస్యం నిండుగా ఉండే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సాధారణంగా విద్వేషాలకు చోటిచ్చే ఘటనలు జరగడం తక్కువే. ఇటీవల కాలంలో వరుసపెట్టి దేవాలయాలు, రథాలు, విగ్రహాలపై దాడులు జరుగుతున్నాయి. విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. రథాలను తగలబెట్టారు. కొన్ని జరుగుతున్నా ఒక్కచోట కూడా నిందితులను పట్టుకోకపోవడం మరిన్ని ఘటనలు జరిగేందుకు కారణమవుతుందన్న విమర్శలున్నాయి. ఏడాది కాలంగా ప్రారంభమైన ఈ మనోభావాలు గాయపరిచే ప్రక్రియకు అడ్డుకట్టవేసే ప్రయత్నాలు జరగాల్సినంత స్థాయిలో జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున నిరసస కార్యక్రమాలు చేపట్టింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఆక్షేపించారు. విగ్రహాల ధ్వంసం కేసులను సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు.

కఠిన చర్యలకు సీఎం ఆదేశం

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి

విగ్రహాల ధ్వంసం లాంటి ఘటనలు దారుణమని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి... దేవుడితో చెలగాటమాడితే కచ్చితంగా దేవుడు శిక్షిస్తాడని పేర్కొన్నారు. విగ్రహాల విధ్వంసం లాంటి ఘటనలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోసారి ఇలాంటి తప్పిదాలకు పాల్పడకుండా చర్యలుండాలని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో అధికారులకు సూచించారు. ఇంతవరకు ఈ ఘటనలపై ఎక్కడా బహిరంగంగా మాట్లాడిందిలేదు. ప్రతిపక్ష తెలుగుదేశంపై అధికారపక్షం తీవ్రస్థాయి ఆక్షేపణలు చేస్తోంది. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, పురపాలక శాఖ మంత్రి బొత్స‌ సహా వైకాపా ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తదితరులు ఈ మొత్తం ఘటనలకు కారణం తెలుగుదేశం పార్టీ నేతలేనంటూ ఎదురుదాడికి దిగుతున్నారు.

వైకాపా ఎంపీ ప్రధానికి లేఖ..

అధికార పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజు ఆలయాల్లో దాడుల ఘటనలపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇంతవరకు ఈ ఘటనలపై నమోదైన కేసుల్లో పురోగతి లేకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

జియో ట్యాగింగ్​కు ఆదేశాలు...

అంతర్వేది ఘటన తర్వాత అన్ని ఆలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని దేవాదాయశాఖ, పోలీసు శాఖ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. కొన్ని ఆలయాల్లో ఈ సౌకర్యం సమకూర్చినా చాలా ఆలయాలు నేటికీ సీసీ కెమెరాల నిఘాకు దూరంగా ఉన్నాయనడానికి రామతీర్థం, ఆ తర్వాత ఆలయాల ఘటనలే ఉదాహరణలు. తాజా పరిమాణాలపై రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌ అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్‌లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని... అర్చకులు, పూజారులు, ఆలయ నిర్వాహకులు, గ్రామస్థులు, స్థానికులతో పాటు పరిసర ప్రాంతల ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండేలా చూడాలని సూచించారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిరంతరం నిఘా, పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్​కు ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికల సమాచారాన్ని తక్షణమే సమీపంలోని పోలీసులకు లేదా డైల్ 100కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్క దేవాలయాలన్నీ జియో ట్యాగింగ్ చేయడం, సీసీ కెమెరాలు ఏర్పాటు మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్తామన్నారు.

ఇదీ చదవండి

రామతీర్థం ఘటన.. దేశం మొత్తానికి జరిగిన అవమానం: సునీల్ దేవధర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.