మండలి రద్దు అంత సులభం కాదు
శాసన మండలి రద్దు అంత సులభమైన వ్యవహారం కాదన్న సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ అన్నారు. గతంలో ఎన్టీఆర్ రాజీవ్‌గాంధీ సహకారంతో మండలిని రద్దు చేశారని ఆయన తెలిపారు. వైకాపాకు మెజారిటీ లేదని మండలి రద్దు చేయాలనుకోవడం సరికాదన్నారు.
మండలి ఖర్చు అనేది దురుద్దేశం మాత్రమే
మండలి రద్దు చేయడానికి ఓ నిర్ణీత ప్రక్రియ ఉంటుందని జంధ్యాల రవిశంకర్ తెలిపారు. మండలి వల్ల అనవసర ఖర్చులు అవుతున్నాయన్న వాదనలో పస లేదన్న ఆయన... మండలి ఖర్చుతో కూడిందని దాన్ని పునరుద్ధరించిన వైఎస్‌కు తెలియదా అని ప్రశ్నించారు.
ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందే..!
సెలక్టు కమిటీకి వెళ్లిన బిల్లుపై ప్రభుత్వం చేపట్టే విధానంపై కోర్టుకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. కోర్టులో ప్రభుత్వం చెప్తున్న సమాధానాలకు, బయట వ్యవహరిస్తున్న తీరుకు పొంతన లేదన్నారు. మండలి రద్దు అనేది రాజ్యాంగ ప్రక్రియ కాబట్టి కోర్టు అన్ని విధాల చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు.
ఇదీ చదవండి : 'సెలక్ట్ కమిటీ అంటే ప్రభుత్వానికి ఎందుకంత భయం'