ETV Bharat / city

నేడు మిర్యాలగూడకు రాంగోపాల్​వర్మ... ఎస్పీని కలిసిన నిర్మాత - telangana news

రాంగోపాల్​వర్మ సరికొత్త చిత్రం మర్డర్ ఈనెల 24న విడుదలకు సిద్ధమైంది. సినిమా ప్రమోషన్​లో భాగంగా చిత్ర యూనిట్ మంగళవారం మిర్యాలగూడకు వెళ్లబోతోంది. ఈక్రమంలో రక్షణ కల్పించాలని నిర్మాత నట్టి కుమార్.. ఎస్పీ రంగనాథ్​ను కలిశారు.

secure-murder-movie-promotion
secure-murder-movie-promotion
author img

By

Published : Dec 22, 2020, 12:24 AM IST

మర్డర్ సినిమా ప్రమోషన్స్​కు భద్రత కల్పించాలని ఆ సినిమా నిర్మాత నట్టి కుమార్ నల్గొండ ఎస్పీ రంగనాథ్​ని కలిసి వినతపత్రం అందజేశారు. నేడు మిర్యాలగూడలో జరిగే ప్రెస్ మీట్​కు మూవీ టీమ్ వస్తుందని తెలిపారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ వస్తున్నందున.. ప్రత్యేక రక్షణ కల్పించాలని కోరారు.

కార్యక్రమానికి ఎస్పీ అనుమతి ఇచ్చినట్లు నట్టికుమార్ తెలిపారు. హైకోర్టు, సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చినందున ఈ నెల 24న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సినిమా ఎవరిని ఉద్దేశించి తియలేదని, సినిమా తీయడం తమ హక్కు అని అన్నారు.

ఇదీ చూడండి: కనువిందుగా యాదాద్రి ఆలయనగరి డ్రోన్​ చిత్రాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.