బోయినపల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలైన మాజీ మంత్రి అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై సికింద్రాబాద్లో కోర్టులో వాదనలు ముగిశాయి. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. అఖిలప్రియ ఆరోగ్యం సరిగా లేదని పిటిషన్లో ఆమె తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నందున అఖిలప్రియకు చంచల్గూడలోనే సరైన వైద్యం అందించాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఆ పిటిషన్ కొట్టివేత...
అఖిలప్రియ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన సికింద్రాబాద్ కోర్టు వేసింది. మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాలన్న అఖిలప్రియ పిటిషన్ తిరస్కరించింది. జైలులో తగిన వైద్య సౌకర్యాలున్నాయని తెలిపింది. జైలు అధికారులు సూచిస్తే నిర్ణయం తీసుకుంటామన్న న్యాయస్థానం స్పష్టం చేసింది.