గ్రామ సచివాలయ ఉద్యోగాలకు మొత్తం 21.70 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సెప్టెంబర్ 1 నుంచి వారం రోజుల పాటు పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. అభ్యర్థులు ఎక్కువ పోస్టులకు పరీక్షలు రాసేందుకు వీలుగా షెడ్యూల్ ను రూపోందించామన్నారు. 6 వేల పరీక్ష కేంద్రాలు అవసరమవుతాయని అంచనా వేశామని.. గూగుల్ మ్యాప్‌లో పరీక్ష కేంద్రం లోకేషన్ తెలుసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాలు, వీడియో రికార్డింగ్ పర్యవేక్షణలో పరీక్షలు జరుపుతామని పేర్కొన్నారు.
పరీక్షల షెడ్యూల్ వివరాలు
- సెప్టెంబర్ 1 నుంచి 7 రోజుల పాటు గ్రామ సచివాలయాల పోస్టులకు పరీక్షలు
- కేటగిరీ-1 లోని 4 పోస్టులకు సెప్టెంబర్ 1న ఉదయం పరీక్ష
- పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీసు, వెల్పేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, వార్డు అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీలకు సెప్టెంబర్ 1న ఉదయం
- పంచాయతీ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు సెప్టెంబర్ 1 మధ్యాహ్నం
- 2బి కేటగిరిలోని వీఆర్వో, సర్వే అసిస్టెంట్‌లకు 3వ తేదీ ఉదయం
- ఏఎన్‌ఎం/వార్డు హెల్త్ సెక్రటరీ 3వ తేదీ మధ్యాహ్నం
- గ్రామ వ్యవసాయ సెక్రటరీ పోస్టులకు 4న ఉదయం
- విలేజ్ హార్టికల్చర్ సెక్రటరీ 4న మధ్యాహ్నం
- విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ పోస్టులకు 6వ తేదీ ఉదయం
- ఎనిమల్ హస్బండరీ పోస్టులకు 6వ తేదీ మధ్యాహ్నం
- 2ఏ కేటగిరిలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్, వార్డు ఎమినిటి సెక్రటరీకి 7న ఉదయం
- విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 7న మధ్యాహ్నం
- వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ 8న ఉదయం
- వార్డు వెల్ఫేర్ అండ్ డెవెలప్ మెంట్ సెక్రటరీ 8న ఉదయం
- వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ 8న మధ్యాహ్నం
- వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ 8న మధ్యాహ్నం
ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వాలంటీర్లు విధుల్లో చేరుతారని తెలిపారు. లక్షా 82 వేల మందికి ఎంపిక పత్రాలు అందజేశామని అన్నారు. పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా నియామకాలు జరుగుతాయని వెల్లడించారు. నియామక ప్రక్రియల్లో ఎలాంటి అక్రమాలకు తావుండదని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.