రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం మధ్య స్థానిక సంస్థల ఎన్నికల పంచాయితీ మరింత ముదురుతోంది. ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు కోసం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ మరోసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. నిన్న జరగాల్సిన సమావేశం వాయిదా పడటంతో.. ఇవాళ మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించిన ఎస్ఈసీ.. ఆ సమావేశానికి అధికారులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని లేఖలో సీఎస్‌ను కోరారు. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ నిర్వహించే వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు అధికారులకు ఇప్పటి వరకు ఎలాంటి అనుమతి రాకపోవడంతో వారిలో అయోమయం నెలకొంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ సమావేశం నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం.. అందుకు తగ్గట్లు తన కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. కలెక్టర్లకు ..ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో నిన్న జరగాల్సిన సమావేశం వాయిదా పడింది.
ఇదీ చదవండి: