ETV Bharat / city

కోర్టు తీర్పు వచ్చాకే ఎన్నికల ప్రక్రియ కొనసాగిద్దాం: ఎస్ఈసీ - sec neelam sahni on mptc, zptc elections

sec neelam sahni on mptc, zptc elections

author img

By

Published : Apr 1, 2021, 5:24 PM IST

Updated : Apr 1, 2021, 7:37 PM IST

17:18 April 01

.

పరిషత్ ఎన్నికల పిటిషన్లపై కోర్టు తీర్పు వచ్చాకే  ఎన్నికల ప్రక్రియ కొనసాగిద్దామని ఎస్​ఈసీ నీలం సాహ్ని.. అధికారులకు చెప్పారు. ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయతీరాజ్ అధికారులతో ఎస్​ఈసీ సమావేశమయ్యారు. పరిషత్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. ఎన్నికలపై ఎప్పుడు ప్రకటన వచ్చినా వెంటనే సన్నద్దమవ్వాలని కోరారు. ఎన్నికలపై హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్నందున.. ఎన్నికల నిర్వహణపై కమిషనర్‌ సమాలోచనలు చేశారు. కోర్టు తీర్పు వచ్చాకే ఎన్నికల ప్రక్రియ కొనసాగిద్దామని అధికారులకు చెప్పారు.

జిల్లాల్లో కొవిడ్ పరిస్థితులను ఎస్​ఈసీ అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్​ఈసీ సమావేశం కానున్నారు. పరిషత్ ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. ఎన్నికల పిటిషన్లపై ఇప్పటికే విచారణ పూర్తిచేసిన న్యాయస్థానం.... తీర్పు రిజర్వు చేసింది. ఈనెల 3న తీర్పు వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైకోర్టు తీర్పు వచ్చాకే ఎన్నికల ప్రక్రియ కొనసాగింపుపై ఎస్ఈసీ ప్రకటన చేసే అవకాశం ఉందని ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి:

ఎస్​ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని

Last Updated : Apr 1, 2021, 7:37 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.