ETV Bharat / city

రాష్ట్ర ప్రభుత్వంపై ఎస్‌ఈసీ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ - SEC Nimmagadda files contempt petition in High Court

SEC Petetion on State Govt
రాష్ట్ర ప్రభుత్వంపై ఎస్‌ఈసీ కోర్టు ధిక్కరణ పిటిషన్‌
author img

By

Published : Dec 18, 2020, 12:58 PM IST

Updated : Dec 18, 2020, 9:00 PM IST

12:54 December 18

రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసిన ఎస్‌ఈసీ

స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదంటూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఫిబ్రవరిలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. గతంలో ఎన్నికల నిర్వహణలో ఎస్‌ఈసీకి సహాయ సహకారాలు అందించాలంటూ హైకోర్టు ధర్మాసనం పేర్కొన్న విషయాన్ని పిటిషన్‌లో ప్రస్తావించారు.  ఎన్నికలకు సహకరించాలని కోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్టుగా ఉంటోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతిస్పందన సరిగా లేదని.. ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని నిమ్మగడ్డ కోరారు. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 22కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

 'పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వ వాదనలో వాస్తవం లేదు'

Last Updated : Dec 18, 2020, 9:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.