పరిషత్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ నేటికి వాయిదా పడింది. పిటిషనర్ల తరఫున వాదనలు ముగిశాయి. నేడు ఎస్‌ఈసీ తరఫు వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.
ఎస్ఈసీ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ జనసేన హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని పేర్కొంది. పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరింది. రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా తీసుకోలేదని పిటిషన్‌లో ప్రస్తావించింది. ఎన్నికల ప్రక్రియ మొదటినుంచి ప్రారంభించాలని కోరుతూ ఇప్పటికే భాజపా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై వాదనలు విన్న ధర్మాసనం... విచారణను నేటికి వాయిదా వేసింది.
అయితే అంతకుముందు పరిషత్ ఎన్నికల అంశంపై ఎస్‍ఈసీ 45 పేజీల కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. నిబంధనల ప్రకారమే పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేసింది. నిలిచిన ఎన్నికలను యథావిధిగా కొనసాగిస్తున్నామని తెలిపింది. ఎన్నికలు సజావుగా సాగేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును కోరింది.
ఇదీ చదవండి: పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టులో జనసేన పిటిషన్