ETV Bharat / city

ఇకపై సగమే పాఠశాలలు.. జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా మార్పులు - the national education system-2020 at state news update

పాఠశాలల సముదాయాల్లో ఇక సగమే ఉంటాయా అంటే అవునంటున్నాయి విద్య వర్గాలు.. విద్యార్థులందరికీ ఆధునిక సౌకర్యాలు అందేలా చర్యలు చేపడుతూనే.. ఒకే దాంట్లో ఎక్కువ బడులు, ఉపాధ్యాయులు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జాతీయ విద్యావిధానం - 2020’కి అనుగుణంగా ప్రభుత్వం మార్పులు చేపట్టగా ఈ ప్రక్రియ జిల్లాలో తుది దశకు చేరుకుంది.

schools Changes
జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా మార్పులు
author img

By

Published : Oct 1, 2020, 7:43 AM IST

Updated : Oct 1, 2020, 7:54 AM IST

అన్ని వసతులూ ఉన్న హైస్కూళ్లు కేంద్రాలుగా ‘బడుల సముదాయాలు’

‘జాతీయ విద్యావిధానం - 2020’కి అనుగుణంగా రాష్ట్రంలోనూ మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రక్రియలో ప్రస్తుతం పాఠశాలల సముదాయాలను కుదించే పని చురుకుగా సాగుతోంది. ఇప్పటివరకు ఉన్న విధానంలో 4 నుంచి 6 పాఠశాలలు, 10 నుంచి 15 మంది ఉపాధ్యాయులు ఒక క్లస్టర్‌ పరిధిలో ఉండేవారు. విద్యాశాఖ కార్యక్రమాలను సముదాయాల వారీగా ముందుకు తీసుకెళ్లేవారు. తాజా మార్పు ఏమిటంటే గ్రామీణ ప్రాంతాల్లో 15 నుంచి 20 పాఠశాలలు, అలాగే నగరాలు, పట్టణాల్లో అయితే 10 నుంచి 15 పాఠశాలలు ఒక సముదాయం కిందకు తీసుకొస్తున్నారు. వీటి పరిధిలో కనీసం 40 నుంచి 50 మందికి పైగా ఉపాధ్యాయులు ఉండనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల సముదాయం నుంచి బడికి మధ్య దూరం 10 నుంచి 15 కి.మీ. కాగా.. పట్టణ ప్రాంతాల్లో ఈ దూరం 5 నుంచి 10 కి.మీ.గా నిర్ణయించారు. జిల్లాలో ప్రభుత్వ పరిధిలోని సుమారు 2,800 పాఠశాలలు 296 సముదాయాలుగా ప్రస్తుతం ఉన్నాయి. వీటి సంఖ్య సగానికి సగం తగ్గనుంది. తాజా ప్రక్రియ జిల్లాలో తుది దశలో ఉంది. ఒకటి, రెండు రోజుల్లో పూర్తికానుంది.

మండలాల నుంచి జిల్లాకు జాబితాలు

మండల విద్యాశాఖాధికారి, సీనియర్‌ ప్రధానోపాధ్యాయులతో కూడిన కమిటీలు తమ మండల పరిధిలోని సముదాయాలను పునర్‌ వ్యవస్థీకరించి జిల్లా విభాగానికి పంపుతున్నారు. ఉర్దూ బడులను విడిగా ప్రత్యేక సముదాయాలుగా చేయనున్నారు. ఎయిడెడ్‌ పాఠశాలలను ఈ ప్రక్రియ నుంచి మినహాయించారు. మొత్తం మీద తాజా ప్రక్రియతో ఎంఈవోలు, వారి కార్యాలయాలపై భారం తగ్గుతుంది. తొలి దశలోని పాఠశాలల సముదాయాల ప్రక్రియ ముగిసిన అనంతరం ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, నిపుణులతో క్లస్టర్లను ఏర్పాటుచేయనున్నారు. భాషా, విషయ నిపుణుల సేవలను మరింత క్రియాశీలకంగా సద్వినియోగం చేసుకుని, విద్యార్థులకు మెరుగైన బోధన అందించడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

డివిజన్‌లో సగానికి సగం తగ్గాయి

తెనాలి డివిజన్‌లోని 11 మండలాల్లో ప్రభుత్వ పరిధిలో మొత్తం 440 పాఠశాలలు, 52 సముదాయాలుగా ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు వాటిని ప్రతి మండల పరిధిలో మండల విద్యాశాఖాధికారి, సీనియర్‌ ప్రధానోపాధ్యాయులతో ఏర్పడిన కమిటీలు పునర్‌వ్యవస్థీకరిస్తూ జాబితా రూపొందించారు. వాటి ప్రకారం డివిజన్‌లో 25 సముదాయాలు మాత్రమే తాజాగా ఏర్పడనున్నాయి. తుది జాబితాలను జిల్లా అధికారులకు పంపించాం. అక్కడ సమీక్ష అనంతరం వాటిని ఖరారు చేసి రాష్ట్ర విభాగానికి పంపుతారు. రెండు, మూడు రోజుల్లో ఈ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. - వి.శ్రీనివాస్‌, తెనాలి డివిజన్‌ ఉప విద్యాశాఖాధికారి.

డిజిటల్‌ తరగతులు, ఆధునిక సౌకర్యాలున్న ఉన్నత పాఠశాల ప్రధాన కేంద్రంగా నూతన సముదాయాలు ఏర్పాటుకానున్నాయి. వాటికి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను అనుసంధానిస్తున్నారు. ఎక్కువ బడులను ఒక క్లస్టర్‌ పరిధిలోకి తీసుకురావడం ద్వారా ఎక్కువ మంది విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నది ప్రణాళిక. అంతేగాక ఉపాధ్యాయులు వ్యక్తిగత సెలవులు పెట్టినప్పుడు సమదాయం పరిధిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి కూడా ఈ విధానం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి సముదాయానికి అంతర్జాల సౌకర్యం, బోధనోపకరణాలు, క్రీడా పరికరాలను ప్రభుత్వం అందించనుంది. చదువు, ఆటలు, పాటలు ఇతర అంశాలన్నింటిలోనూ విద్యార్థులకు మెరుగైన వెసులుబాటు ఇవ్వడం తాజా మార్పు వెనుక ఉన్న ప్రధాన అంశం.

ఇవీ చూడండి...

'పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యం'

Last Updated : Oct 1, 2020, 7:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.