Sarpanches Relay Fasts : రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్న 14, 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాలని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మల్కిపురంలో సర్పంచులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పంచాయతీలో నిధులు లేకపోవడంతో గ్రామ పరిపాలన భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీజీ గ్రామ స్వరాజ్యం తీసుకువస్తే.. రాష్ట్రంలో గ్రామ దౌర్భాగ్యం ఏర్పడిందన్నారు. గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడిన తర్వాత.. ఇలాంటి దుస్థితి ఎన్నడూ ఎదుర్కోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్థిక నిధులు లేకపోవడంతో గ్రామాల్లో రహదారులు, పారిశుద్ధ్యం కుంటుపడిందని.. గ్రామాల్లోకి వెళుతుంటే ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నామని వాపోయారు. సచివాలయ వ్యవస్థతో పంచాయతీ పాలన మరుగున పడుతుందని.. సచివాలయాలను సర్పంచుల కిందకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్న ఆర్థిక సంఘం నిధులను ఖాతాలకు జమ చేయాలని.. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి: