ప్రజలు కరోనా కోరల్లో చిక్కుకోకుండా.. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఒమ్మివరం సర్పంచ్ చూపుతున్న చొరవ ప్రశంసలు పొందుతోంది. తెలుగుదేశం మద్దతుతో సర్పంచ్ గా గెలిచిన పాలపర్తి బాలకోటి.. సామాజిక బాధ్యతగా తన ఊరి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. మైక్ పట్టుకొని గ్రామమంతా కలియదిరుగుతూ.. కరోనా ముప్పు గురించి ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామాలపైనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్నందున.. మధ్యాహ్నం 12 గంటల తర్వాత బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన అనుభవం ఉన్న ఆయన.. పాటలు పాడుతూ ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు.
ఎంతో అభిమానంతో తనను గెలిపించిన ప్రజల క్షేమం కోరి.. ఈ విధంగా ప్రచారం చేస్తున్నానని సర్పంచ్ చెబుతున్నారు. సర్పంచ్ కోటి స్ఫూర్తిని గౌరవించి, కొవిడ్ నిబంధనలు పక్కాగా పాటిస్తున్నామని గ్రామస్థులు అంటున్నారు.
ఇదీ చదవండి
జ్యుడీషియల్ రిమాండ్‌లోని నరేంద్రను జైలుకు ఎలా తరలిస్తారు?: కోర్టు