ETV Bharat / city

SAND BOOKING : మళ్లీ ఆన్​లైన్​లో ఇసుక బుకింగ్ మొదలు - sand-booking-in-online-at-andhrapradhesh

రాష్ట్రంలో ఇసుక అవసరమైన వారు ఇసుక రీచ్​లు, డిపోలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా... ఆన్​​లైన్​లో బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. గనులశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇసుక తవ్వకాలు, విక్రయాలు చేస్తున్న జేపీ పవర్ వెంచర్స్ సంస్థ.... ఆన్​లైన్ పోర్టల్​ను అదివారం ప్రారంభించింది.

మళ్లీ ఆన్​లైన్​లో ఇసుక బుకింగ్ మొదలు
మళ్లీ ఆన్​లైన్​లో ఇసుక బుకింగ్ మొదలు
author img

By

Published : Nov 1, 2021, 11:44 AM IST

రాష్ట్రంలో ఇసుక అవసరమైన వారు ఇసుక రీచ్​లు, డిపోలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా... ఆన్​​లైన్​లో బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. గతంలో ఏపీ ఖనిజాబివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)మాదిరిగానే డోర్ డెలివరీ చేసేందుకు అందులో ఏర్పాట్లు చేశారు. గనులశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇసుక తవ్వకాలు, విక్రయాలు చేస్తున్న జేపీ పవర్ వెంచర్స్ సంస్థ.... ఆన్​లైన్ పోర్టల్​ను అదివారం ప్రారంభించింది. www.andhrasand.com పేరిట ఉండే ఈ పోర్టల్​లో ఆదివారాలు తప్ప రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఇసుక బుకింగ్ చేసుకోవచ్చు. రీచ్​లో టన్ను రూ.475, ఆయా డిపోల్లో అధికారులు నిర్ణయించిన ధర ప్రకారం తీసుకోనున్నారు. డోర్ డెలివరీ కావాల్సిన వారి చిరునామాను గూగుల్ మ్యాప్ ద్వారా ఎంత దూరం ఉంటుందో పరిగణలోకి తీసుకుని, అందుకు అయ్యే రవాణా ఛార్జీలను ఆన్​లైన్​లో పేర్కొంటారు. వీటిని చెల్లించిన వారికి డెలివరీ చేయనున్నారు.ఆంధ్రా శాండ్ పేరిట యాప్ సిద్ధం చేశారు. ఇందులో కూడా ఇసుక బుకింగ్​కు వీలు కల్పించారు.

గనులశాఖ పర్యవేక్షణలో ఫోన్ నంబరు...

ఇసుక బుకింగ్, ఆన్​లైన్​లో సమస్యలు తదితరాలపై సంప్రదించేందుకు 9700009944 నంబరును అందుబాటులోకి తెచ్చినట్లు గనులశాఖ అధికారుల తెలిపారు. త్వరలోనే గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా ఇసుక బుకింగ్​​కు సదుపాయం మొదలవుతుందని పేర్కొన్నారు.

ఇవీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.