కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కోరారు. స్వీయ నిర్బంధం పాటించడం, సామాజిక దూరం పాటించడం వల్ల వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా.. కొన్ని చోట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండటం లేదన్నారు. ఈ తరహా చర్యలు ప్రమాదకరమని ప్రజలంతా తమను తాము రక్షించుకోవాలని కోరారు. విపత్తు నివారణకు ప్రభుత్వం చేయగలిగినంత వరకు చేస్తుందని.. ప్రజల సహకారం లేకపోతే ప్రభుత్వం ఎంత చేసినా ప్రయోజనం ఉండదన్నారు.
ఇప్పుడు రాజకీయాలు తగదు: సజ్జల
కరోనా వైరస్ దృష్ట్యా శాసనసభ సమావేశాలు జరపాలా వద్దా అనే విషయంపై పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై 2 రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామన్నారు. కరోనా వ్యాప్తితో విపత్కర పరిస్థితులున్న తరుణంలో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని.. ఇది సరి కాదని చెప్పారు. ప్రభుత్వ ఖజానాలో నిధులున్నా ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం వేసిందని ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. సీఎం జగన్ ప్రభుత్వ పరంగా చేయాల్సిందంతా చేస్తున్నారన్నారు. రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సరకులు ఇవ్వడం సహా వెయ్యి రూపాయలు ఇస్తున్నారని గుర్తు చేశారు.
ఇదీ చదవండి: