Uppalapati Sundara Naidu Demise: ప్రముఖ పారిశ్రామికవేత్త, బాలాజీ హేచరీస్ లిమిటెడ్ అధినేత ఉప్పలపాటి సుందరనాయుడు లేని లోటు తీర్చలేనిదని ఆయన కుమార్తె, మార్గదర్శి చిట్ ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ శైలజాకిరణ్ అన్నారు. ఏపీలోని చిత్తూరు జిల్లాలో మొదటిసారి అప్పట్లో సేంద్రియ వ్యవసాయం తీసుకొచ్చి రైతులకు పరిచయం చేశారని గుర్తుచేశారు. తమ ఫామ్‌లో సేంద్రియ వ్యవసాయం, కోడిగుడ్ల ఉత్పత్తి, లభ్యత చూసిన ఎంతో మంది రైతులు స్ఫూర్తి పొందారని తెలిపారు.
ఆ స్ఫూర్తితో చిత్తూరు, కర్నూల్, అనంతపురం, కడప జిల్లాల్లో చాలా అభివృద్ధి జరిగిందన్నారు. అనేక మంది చిన్న, సన్నకారు పౌల్ట్రీ రైతులు ఉన్నత స్థాయిలోకి వచ్చారని తెలిపారు. తమ పిల్లలను పెద్ద పెద్ద చదువులు చదివించుకుని చాలా మంది అమెరికాలో స్థిరపడ్డారని చెప్పుకొచ్చారు. వారందరికి సుందరనాయుడు ఎంతో ప్రేమ, అభిమానంతో ఉంటారని చెప్పారు. నిరంతరం పౌల్ట్రీ రైతులు బాగుండాలని... గుడ్లు, చికెన్ ధరలు బాగుండాలని పౌల్ట్రీ పరిశ్రమ రంగం అభివృద్ధి కోసమే ఆయన తీవ్రంగా కృషి చేశారని గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం తమతో పాటు వేలాది రైతు కుటుంబాలకు కూడా తీరని లోటన్నారు. అంతమంది రైతుల హృదయాల్లో స్థానం సంపాదించడం మాకు చాలా గర్వకారణంగా ఉందని శైలజాకిరణ్ పేర్కొన్నారు.
'చిత్తూరు జిల్లాలో మొదటిసారి అప్పట్లో సేంద్రియ వ్యవసాయం తీసుకొచ్చి రైతులకు పరిచయం చేశారు. తమ ఫామ్‌లో సేంద్రియ వ్యవసాయం, కోడిగుడ్ల ఉత్పత్తి, లభ్యత చూసిన ఎంతో మంది రైతులు స్ఫూర్తి పొందారు. ఆ స్ఫూర్తితో చిత్తూరు, కర్నూల్, అనంతపురం, కడప జిల్లాల్లో చాలా అభివృద్ధి జరిగింది. అనేక మంది చిన్న, సన్నకారు పౌల్ట్రీ రైతులు ఉన్నత స్థాయిలోకి వచ్చారు. నాన్నగారు వేలాది మంది రైతుల గుండెల్లో స్థానం సంపాదించారు.' - సీహెచ్ శైలజాకిరణ్, మార్గదర్శి చిట్ ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్
ఇదీ చూడండి: