ETV Bharat / city

పుర పోరు: పోటాపోటీగా అధికార ప్రతిపక్షాల ప్రచారాలు

ప్రధాన పార్టీలు ప్రచారాలకు మరింత పదును పెట్టాయి. డప్పు వాయిద్యాలతో సందడి చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం ముమ్మరం చేశాయి. పట్టు నిలుపుకునేందుకు అధికార ప్రతిపక్షాలు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు.

Competitive campaigns in muncipal elections
పోటాపోటీగా అధికార ప్రతిపక్షాల ప్రచారాలు
author img

By

Published : Mar 8, 2021, 9:37 AM IST

ఈ నెల 10న జరుగనున్న జీవీఎంసీ ఎన్నికలో తేదేపా కార్పొరేటర్​ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ విశాఖ జిల్లా అనకాపల్లిలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. 80వ వార్డు తెదేపా కార్పొరేటర్​ అభ్యర్థిని బొడ్డేడ వరలక్ష్మి తరపున ఎన్నికల ప్రచార ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెదేపా ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆదరిస్తే.. నగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా..

అనంతపురంం జిల్లా హిందూపురం మున్సిపల్ ఎన్నికలలో అధికార పార్టీ వైకాపా ప్రచార పర్వం కొనసాగిస్తోంది. వైకాపా అభ్యర్థులను గెలిపించాలని స్థానిక ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ఓటర్లను కోరారు. వైకాపాను ఆదరిస్తే.. నగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ తెలిపారు.

కమ్యూనిస్టు పార్టీలను గెలిపిస్తే.. పన్ను భారం ఉండదు..

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్​లో సీపీఎం అభ్యర్థి ఇందిరాకు మద్దతుగా ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలపించిన విప్లవ గీతాలకు కళాజాత నృత్యాలు ఆహుతలను అలరించాయి. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసే కమ్యూనిస్టు పార్టీలను గెలిపిస్తే.. ప్రజలపై పన్ను భారం పడకుండా పోరాటం చేసే బాధ్యత తీసుకుంటుందని బాబురావు వివరించారు.

పట్టు నిలుపుకునేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీ..

పురపాలక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పార్టీ నాయకులు ప్రచార జోరు పెంచారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు కార్పొరేషన్​తో సహా ఐదు పట్టణాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. తెదేపా తరఫున మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, అధికారం వైకాపా అభ్యర్ధులకు మద్దతుగా ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రచారాల ముగింపునకు గడువు దగ్గర పడుతుండటం.. పట్టు నిలుపుకునేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.

అర్హులందరికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాం..

విజయనగరం 33వ డివిజన్ కార్పొరేటర్​ అభ్యర్థి రంగారావు.. భారీ ర్యాలీ నిర్వహించారు. అర్హులందరికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందిస్తూ ప్రభుత్వం ప్రతి ఒక్కరి అభ్యున్నతికి పాటు పడుతుందన్నారు.. ప్రజలు తనకు ఓటు వేసి గెలిపిస్తే డివిజన్ ను మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్తానంటూ హామీ ఇచ్చారు.

కడప జిల్లా బద్వేలులో వైకాపా తరపున ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, తెదేపా తరపున మాజీ ఎమ్మెల్యే విజయమ్మ పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని ఓట్లను అభ్యర్థించారు.

ఇవీ చూడండి...: వైకాపాను నమ్మితే మీ బిడ్డల భవిష్యత్తుకే ప్రమాదం: చంద్రబాబు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.