ETV Bharat / city

పల్లెపోరు: ఎవరు ఎంత ఖర్చుపెట్టాలి..? లెక్కల సంగతేంటి..? - ap sec news

ఎన్నికలు అనగానే పార్టీ శ్రేణుల హడావిడి మాములుగా ఉండదు. జెండాలు, మైక్​లు, ప్రచార వాహనాలతో పల్లె నుంచి పట్నం వరకు దద్దరిల్లిపోవాల్సిందే. ఇందులోనూ పంచాయతీ ఎన్నికలంటే... కథ మాములుగా ఉండదు. వ్యూహ ప్రతివ్యూహాలు, హామీలే కాదు.. చేతివాటం కూడా కాస్త ఎక్కువే ఉంటుంది. కాస్త మేజర్ పంచాయతీలో అయితే చెప్పాల్సిన పనేలేదు. ప్రతిష్టాత్మకంగా తీసుకంటే లెక్కే ఉండదు. కానీ ఇలా ఖర్చు చేసిన వాటి ప్రతి రూపాయికీ లెక్క చెప్పాల్సి ఉంటుంది. మరీ పల్లె పోరులో అభ్యర్థి ఎంత వరకు ఖర్చు చేయాలి..? చేసిన వాటికి లెక్క చెప్పాల్సిందేనా..? ఎన్నికల నిబంధనలు ఏం చెబుతున్నాయో చూద్దాం..!

ap local polls 2021
ఏపీ పంచాయతీ ఎన్నికలు 2021
author img

By

Published : Feb 8, 2021, 10:02 AM IST

సాధారణ ఎన్నికలతో పోల్చితే స్థానిక సంస్థల సంగ్రామం ప్రతిష్ఠాత్మకంగానే ఉంటుంది. వార్డుల్లోని ప్రతి ఇంటి ఓట్లను తమకే దక్కాలని ఆయా పార్టీల అభ్యర్థులు ప్రణాళికలు వేసుకుంటుంటారు. విజయం సాధించేందుకు ఎంతటి ఖర్చుకైనా వెనుకాడరు. రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో భారీస్థాయిలో ఖర్చుపెట్టడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఎంతోమంది ఉన్నారు. కానీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన నిబంధనల ప్రకారమే వారు నడుచుకోవాలి. అభ్యర్థులు ఖర్చుపెట్టే ప్రతి రూపాయిని లెక్కచెప్పాల్సిందే. దానికి అనుగుణంగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. సర్పంచి అభ్యర్థితోపాటు, వార్డు సభ్యులకు సైతం ఈ నిబంధనలు వర్తిస్తాయి.

ఎవరెవరు ఎంత ఖర్చుపెట్టాలి..?

పదివేలకుపైగా జనాభా ఉన్న పంచాయతీల్లో పోటీచేస్తున్న సర్పంచి అభ్యర్థి రూ.2.50 లక్షలు, పదివేలలోపు జనాభా ఉన్న పంచాయతీల్లో రూ.1.50 లక్షల వరకు ఖర్చు చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా వార్డు సభ్యులుగా పోటీచేసే పంచాయతీల్లో జనాభా పదివేలకుపైగా ఉంటే రూ.50 వేలు, అంతకంటే తక్కువ ఉంటే రూ.30 వేలు మాత్రమే వ్యయం చేయాలి.

నామినేషన్లు వేసినప్పటి నుంచీ...

అభ్యర్థులు నామినేషన్లు వేసినప్పటి నుంచి ఎన్నికల వ్యయంపై నిబంధనలు అమలవుతాయి. ఖర్చు చేసిన నగదుకు సంబంధించిన వివరాలను అధికారులతో తనిఖీ చేయించుకుంటూ ఉండాలి. ఎన్నికలు ముగిసిన అనంతరం 45 రోజుల్లోపు అభ్యర్థులు ఎవరికి వారు తాము ఖర్చుచేసిన వ్యయానికి సంబంధించిన వివరాలను ఆ గ్రామ పంచాయతీలో తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. అలా గడువులోపు సమర్పించని పక్షంలో తొలుత నోటీసులు జారీ చేస్తారు. అప్పటికీ స్పందించకుంటే ఎన్నికల్లో గెలిచినా చట్టప్రకారం అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఒకవేళ అతను ఓడినా మరోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటిస్తారు. అందుకే అభ్యర్థులు ఖర్చుచేసే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. లెక్కలేనట్లుగా వ్యవహరిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు.

ఇదీ చదవండి: పల్లె పోరు: బరిలో అక్కాచెల్లెలు..నేనున్నానంటూ బంధువు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.