ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై.. ఆర్టీసీ కార్మిక సంఘాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డినిసన్మానించాయి. బుధవారం సచివాలయానికి వచ్చిన ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్, ఎన్ఎంయూ, వైఎస్ఆర్ ఆర్టీసీ యూనియన్‌తో సహా ఇతర కార్మిక సంఘాల నేతలు ముఖ్యమంత్రిని కలిశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందుకు ధన్యవాదాలు తెలిపి ఘనంగా సత్కరించారు. సంస్థలో ఇప్పుడు అమలవుతున్న సదుపాయాలన్నింటినీ యథాతథంగా అమలు చేస్తామని వారికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సదుపాయాలు కల్పించాలని కార్మిక సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: