బతుకమ్మ, దసరా ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఎంజీబీఎస్, సీబీఎస్, జూబ్లీ బస్‌స్టేషన్ సహా హైదరాబాద్‌లోని ముఖ్య ప్రాంతాల నుంచి బస్సుల సర్వీసులు నడిపిస్తామని రంగారెడ్డి జిల్లా రీజినల్ మేనేజర్ వరప్రసాద్ వెల్లడించారు. 4 వేల 933 ప్రత్యేక బస్సులో రాష్ట్రంలోని ముఖ్యప్రాంతాలకు 964 బస్సులు, మిగిలిన వాటిని వివిధ ప్రాంతాలకు నడుపాతామని తెలిపారు. ప్రత్యేక బస్సులకు ఒకటిన్నరరేటు అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు స్పష్టంచేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం మే ఐ హెల్ప్ యూ, విచారణ కేంద్రాలను, ఆర్టీసీ అధికారులను అందుబాటులో ఉంచామన్నారు. ప్రయాణికులు రద్దీ పెరిగితే అందుకు అనుగుణంగా మరిన్ని బస్సులను పెంచుతామని తెలంగాణ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
దసరా కోసం తెలంగాణ ఆర్టీసీ 4వేల 933 ప్రత్యేక బస్సులు - RTC 4 thousand 933 special buses for Dussehra
దసరాకు ఊరెళ్లే ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా..ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. 4 వేల 933 బస్సులను తెలంగాణ లోని వివిధ ప్రాంతాలు సహా రాష్ట్రంలోని ముఖ్యపట్టణాలకు నడిపించనున్నట్లు ఆ రాష్ట్ర రంగారెడ్డి జిల్లా రీజినల్ మేనేజర్ తెలిపారు. ఈనెల 27 నుంచి వచ్చే నెల 8 వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.
![దసరా కోసం తెలంగాణ ఆర్టీసీ 4వేల 933 ప్రత్యేక బస్సులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4544526-544-4544526-1569366187180.jpg?imwidth=3840)