ETV Bharat / city

సదర్ ఉత్సవాలకు సర్వం సిద్ధం.. ప్రత్యేక ఆకర్షణగా షారూక్ - సదర్ ఉత్సవాలు 2021

సదర్‌ ఉత్సవాల (Sadar Celebrations)కు హైదరాబాద్‌ సిద్ధమవుతోంది. వేడుకల కోసం హరియాణా నుంచి దున్నరాజులు సైతం వచ్చేశాయి. ఈ వేడుకలో రూ. 30 కోట్ల విలువ చేసే షారూక్‌ దున్నరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు నిర్వాహకులు పేర్కొంటున్నారు. దున్నరాజుల పోషణకు రోజుకు రూ. 15 వేల ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల 5వ తేదీన ఖైరతాబాద్‌లో, 7వ తేదీన నారాయణగూడలో వేడుకలు జరగనున్నాయి.

Sadar
Sadar
author img

By

Published : Nov 2, 2021, 7:20 AM IST

సదర్ ఉత్సవాలకు సర్వం సిద్ధం.. ప్రత్యేక ఆకర్షణగా షారూక్

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సదర్ వేడుకల (Sadar Celebrations)కు భాగ్యనగరం ముస్తాబవుతోంది. దీపావళి మరుసటి రోజు యాదవ సోదరులు ఘనంగా నిర్వహించే సదర్ ఉత్సవాల (Sadar Celebrations)కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హరియాణా నుంచి 30 కోట్ల విలువచేసే దున్నరాజులు... ఈ సదర్‌ ఉత్సవాల్లో (Sadar Celebrations) ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

హరియాణా నుంచి..

హైదరాబాద్‌కు ప్రత్యేకమైన సదర్‌ ఉత్సవాల్లో (Sadar Celebrations) దున్నరాజులు కనువిందు చేయనున్నాయి. దీపావళి సందర్భంగా నిర్వహించే సదర్‌ వేడుకల (Sadar Celebrations) కోసం హరియాణా నుంచి దున్నపోతులు నగరానికి వస్తున్నాయి. 5వ తేదీన ఖైరతాబాద్‌లో, 7న నారాయణగూడలో సదర్‌ వేడుకలు (Sadar Celebrations) జరగనున్నాయి. ఇప్పటికే షారుక్‌, లవ్‌ రాణా దున్నరాజులు హైదరాబాద్‌కు చేరుకోగా... మరో ఒకటి, రెండు రోజుల్లో మరో దున్నరాజు రానుంది.

పోషణకు రోజుకు 15 వేల ఖర్చు..

షారూక్‌ దున్నరాజు వయస్సు మూడున్నర సంవత్సరాలు కాగా... 1800 కిలోల బరువు ఉంటుంది. లవ్‌ రాణా వయస్సు 4 ఏళ్లు, 1700 కిలోల బరువు ఉంటుంది. వీటికి ఉదయం, సాయంత్రం పదేసి లీటర్ల పాలతో పాటు పిస్తా, బాదం, కాజూ, ఆపిల్స్‌, 40 కోడిగుడ్లు పెడతారు. సాధారణ రోజుల్లో రోజుకు 7, 8 వేల ఖర్చు అయితే... సదర్‌ ఉత్సవాల (Sadar Celebrations) సమయంలో రోజుకు 15 వేల వరకు ఖర్చు అవుతుంది. రోజుకు రెండు పూటల నువ్వుల నూనెతో మసాజ్ చేస్తారు. ఉదయం నడకకు తీసుకెళ్తారు. సాయంత్రం ఈత చేయిస్తారు. 3 వేల విలువ చేసే జానీ వాకర్‌ ఫుల్‌ బాటిల్‌ వారానికి ఒకటి తాగిస్తారు. ఈ దున్నలను సదర్ ఉత్సవాల (Sadar Celebrations)తో పాటు, పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం పోషిస్తారు. ఇక్కడ కనిపించే షారూక్‌ దున్నరాజు విలువ 30 కోట్ల పైమాటే. లవ్‌ రాణా విలువ దాదాపు 20 కోట్ల వరకు ఉంటుంది. ఒక్కో దున్నరాజుకు ఇద్దరు సహాయకులు ఉంటారు.

ఈసారి ఘనంగా..

కరోనా దృష్ట్యా గతేడాది సదర్‌ వేడుకలు (Sadar Celebrations) సాదాసీదాగా జరగ్గా... ఈసారి ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. నగర నలుమూలల నుంచి ఉత్సవాలు (Sadar Celebrations) తిలకించేందుకు వీక్షకులు భారీగా తరలివస్తారని నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చూడండి: వేధిస్తున్న చిప్​ల​ కొరత- క్షీణించిన వాహన విక్రయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.