ETV Bharat / city

అమరావతి ఉద్యమంలో మహిళలదే కీలకపాత్ర.. ఆదిపరాశక్తులై అలుపెరుగని పోరాటం - role of womens in the Amravati movement

Role of womens in the Amravati movement: వారంతా సాధారణ గ్రామీణ మహిళలు. కానీ... అసాధారణ పటిమతో రాజధాని అమరావతి పోరాటాన్ని కొనసాగించారు. చిన్న శిబిరంతో ప్రారంభించిన నిరసనను... ఎనిమిది వందల రోజులకు పైగా కొనసాగిస్తున్నారు. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని... అది అమరావతే కావాలని స్పష్టం చేస్తూ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతో.. లక్ష్య సాధన దిశగా ముందడుగు వేశారు. నిరసనలు, పాదయాత్ర సందర్భంగా ఎదుర్కొన్న కష్టాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘ఈటీవీ భారత్ ’కి వెల్లడించారు.

Role of womens in the Amravati movement
Role of womens in the Amravati movement
author img

By

Published : Mar 8, 2022, 5:20 AM IST

Role of womens in the Amravati movement: ఐదు కోట్ల మంది ఆంధ్రుల కలల రాజధాని అమరావతి కోసం తమకు అన్నం పెడుతున్న నేలతల్లినిస్తే ఆ కన్నతల్లులకు మిగిలింది కన్నీరే. ఫలితంగా ఊరే దాటని ఆ మహిళలు... తమకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తడానికి ఊరూరా తిరిగారు. అడుగేస్తే అరెస్టు... కూర్చుంటే కేసు... ప్రశ్నిస్తే గృహ నిర్భందంతో ఎంత కట్టుదిట్టం చేసినా మొక్కవోని పటిమ చూపారు. 800 రోజులకుపైగా సాగుతున్న రాజధాని అమరావతి ఉద్యమంలో స్థానిక మహిళలు ఎదుర్కోని అకృత్యం, అరాచకం లేదు. కానీ... వీటన్నింటినీ పంటి బిగువన భరించి ఉద్యమాన్ని ముందుండి నడిపించి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారు. సత్య సంకల్పంతో, శాంతి మార్గంలో ఎల్లలు దాటిన వారి సుదీర్ఘ పోరాటానికి ఇటీవల వచ్చిన హైకోర్టు తీర్పు ఊరటనిచ్చింది. ఆ స్పూర్తిని కొనసాగిస్తూ అమరావతిని రాజధానిగా కొనసాగించడం కాదు... రాజధానిని పూర్తి స్థాయిలో నిర్మించేదాకా మా ఉద్యమం కొనసాగిస్తామంటున్నారా ధీర వనితలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజధాని అమరావతి ఉద్యమంలో పాల్గొన్న మహిళలతో ‘ఈనాడు-ఈటీవీ’ ‘రాజధాని రుద్రమలు’ పేరుతో కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా మహిళలు తమ ఉద్యమ అనుభవాలను పంచుకున్నారు.

.

అమ్మా...! నన్ను మర్చిపోయావా అన్నాడు..

ప్రభుత్వం మమ్మల్ని రోడ్డు మీదికి ఈడ్చంతో అమరావతి ఉద్యమంలో భాగస్వామినయ్యా. 45 రోజుల పాదయాత్రలోనూ పాల్గొన్నా. నా ఇద్దరు పిల్లల్ని బంధువుల ఇంట్లో ఉంచా. ఇంటికి తిరిగొచ్చాక ‘అమ్మా నన్ను మర్చిపోయావా’ అని మా అబ్బాయి అడిగినప్పుడు... నా కళ్లలో నీళ్లు తిరిగాయి. - రాయపాటి శైలజ, గుంటూరు

హేళన చేసిన వారే ముక్కున వేలేసుకున్నారు..

వీరా ఉద్యమం చేసేది... రెండు రోజుల్లో ముగిస్తారని హేళన చేసినవారే ముక్కున వేలేసుకునేలా చేశాం. ఏదైనా శుభకార్యానికి ఒంటరిగా వెళ్లడానికే వెనుకాడే మేము రాజధాని కోసం వేదికలెక్కి నిరసన తెలిపాం. గతంలో పోలీసులంటేనే ఎరగని మమ్మల్ని వైకాపా ప్రభుత్వం పోలీసు స్టేషన్‌లో కూర్చోబెట్టింది. - నాగమల్లేశ్వరి, మందడం

మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారు..

ఉద్యమంలో పాల్గొన్నందుకు మమ్మల్ని ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టింది. పోలీసులతో కొట్టించింది. మన పిల్లలు చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళుతూ... అక్కడ నానా అవస్థలు పడుతున్నారని భావించి రాష్ట్రాభివృద్ధి కోసం భూములిచ్చాం. - షేక్‌ మాలింబీ, రాయపూడి

కుమారుడు అస్వస్థతకు గురైనా వెనుకాడలేదు..

పది రోజుల్లో దీక్ష ముగుస్తుందనుకున్నా. వందల రోజులుగా సాగుతోంది. కన్న కుమారుడు అస్వస్థతకు గురై ఇంటికొచ్చిన మరుసటి రోజే నిరసనల్లో పాల్గొన్నా. పిల్లలకు గోరుముద్దలు తినిపించాల్సిన మా చేతులను లాఠీ దెబ్బలకు అడ్డుపెట్టాం. నువ్విచ్చింది ఎకరంన్నర భూమేగా నీకెందుకు ఉద్యమం అన్నారు. భూమి కోసం కాదు భావితరాల కోసం అని ఉద్యమంలో కొనసాగా. - కొమ్మినేని వరలక్ష్మి, మందడం

ఉద్యమంలో ఉన్నామని వైద్యం చేయలేదు...

ఉద్దండరాయునిపాలెంలో దీక్షా శిబిరం ఏర్పాటు చేశాం. అప్పటి నుంచి మాపై వేధింపులు, దాడులు పెరిగాయి. నా భర్తపై కొందరు దాడి చేస్తే కేసు పెట్టడానికి పోలీసు స్టేషన్‌కు వెళ్తే ఫిర్యాదు తీసుకోలేదు. వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకెళ్తే పడక ఇవ్వలేదు. ‘పై నుంచి ఫోన్లు వస్తున్నాయి. వేరే ఆసుపత్రికి వెళ్లండి’ అని వైద్యం చేయకుండానే పంపించేశారు. -పులి సువార్త, ఉద్దండరాయునిపాలెం

ఉన్న ఒక్క రాజధానిని అభివృద్ధి చేయండి...

ఇప్పటికే ఉన్న ఒక్క రాజధానిని అభివృద్ధి చేయలేని ఈ ప్రభుత్వానికి మూడు రాజధానులెందుకు? మూడేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా? ప్రభుత్వం ఇప్పటికీ నిర్దయగానే వ్యవహరిస్తోంది. మూడు రాజధానులపై సుప్రీంకోర్టుకు వెళ్తామని ప్రకటనలు చేస్తోంది. ఇది హైకోర్టు తీర్పును అవహేళన చేసినట్లే. రాష్ట్రానికి సంక్షేమం, అభివృద్ధి రెండూ అవసరం. అమరావతితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యం. -కంచర్ల పార్వతీదేవి, వెలగపూడి

ఇదీ చదవండి: Paddy Problem: లక్ష్యానికి దూరంగా రైతు భరోసా కేంద్రాలు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.