Rising temperature: మహాశివరాత్రి ముగియడంతోనే వేడి తీవ్రత ప్రారంభమైంది. ఫిబ్రవరి మూడో వారం నుంచే ఎండలు ప్రభావం కనిపిస్తోంది. గత కొద్దిరోజులుగా రాత్రివేళ కొంచెం చల్లగా ఉన్నా.. తెల్లవారు జాము నుంచే ఎండ చుర్రుమనిపిస్తోంది. మధ్యాహ్నం 12 గంటలలోపే ఎండ తీవ్రత పెరిగిపోతోంది. సాయంత్రం నాలుగు గంటలు దాటే వరకు ఉష్ణోగ్రతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి మే వరకు ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే ఎక్కువ నమోదయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Rising temperature: రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉష్ణోగ్రతల ప్రభావం అధికంగా ఉండొచ్చని వాతావరణ నిపుణుల అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయని చెబుతున్నారు. మరోవైపు ఈ ఏడాది మార్చి వరకు దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం చాలా వరకు సాధారణంగా ఉందన్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కానుందని తెలిపారు.
తక్కువ నమోదయ్యే అవకాశం లేదు...
Rising temperature: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకానున్నాయని నిపుణులు పేర్కొన్నారు. వీటితో పాటు ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనే ఈసారి కూడా ఎండలు తీవ్రంగానే ఉండనున్నాయని చెప్పారు. ఈ మూడు నెలల వేసవి కాలంలో రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రత్తలు నమోదయ్యే పరిస్థితి లేదని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.
Rising temperature: మధ్య, తూర్పు భారతంలో వాతావరణ ప్రభావం ఉత్తర కోస్తాపై ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. సాధారణంగా వేసవిలో పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు,.. హిందూ మహాసముద్రంలో తేమగాలులు ప్రభావితం చేస్తుంటాయని చెప్పారు. ప్రస్తుతానికి పసిఫిక్ మహాసముద్రంలో కొనసాగుతున్న లానినా వేసవిలో అంటే ఏప్రిల్, మే నెలల్లో శీతల తటస్థ పరిస్థితుల దిశగా వెళ్లొచ్చు. మే నెల వరకు లానినా కొనసాగుతుందని అంచనాలున్నాయి. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో వేసవి కాలంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం లేదా తక్కువగా నమోదవుతాయని భావిస్తున్నారు. ఇప్పటికే మండిపోతున్న ఎండలకు ఉక్కపోత కూడా కొద్దిరోజుల్లోనే తోడయ్యే పరిస్థితులు ఉన్నాయని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
Govt Land Rights: ఆ ఇళ్లపై వారికే సంపూర్ణ హక్కులు.. ప్రభుత్వ నిర్ణయం