
రబీ ధాన్యం సేకరణ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం బుధవారం రూ.922.19 కోట్లు విడుదల చేసింది. అంతా కలిపి ఇప్పటివరకు మొత్తం రూ.6,344.93 కోట్లు విడుదల చేశారు. రాష్ట్రంలో జులై 28 నాటికి సేకరించిన 35,43,909 టన్నుల ధాన్యాన్నికి మొత్తం రూ.6,634.63 కోట్లను విడుదల చేశారు. రూ. 289.70 కోట్లు చెల్లించాల్సి ఉంది.
జిల్లాల్లో దాన్యం సేకరణ వివరాలు అన్లైన్లో అప్‌లోడ్ చేయగానే బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. చెల్లింపులకు సరిపడ నగదు పౌరసరఫరాల సంస్థ వద్ద అందుబాటులో ఉందని ప్రకటన ద్వార ప్రభుత్వం తెలిపింది.
ఇదీ చదవండి:
Olympics Live: ఒలింపిక్స్ క్వార్టర్స్‌లో సింధు- హాకీలో జోరు