విద్యాశాఖ, నూతన విద్యా విధానం, అంగన్‌వాడీల్లో నాడు-నేడుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నూతన విద్యావిధానం అమలుకు కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రెండేళ్లలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని... నూతన విద్యా విధానం వల్ల టీచర్లు, పిల్లలకు మేలని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత, భవిష్యత్ తరాలకు ప్రయోజనం కలుగుతుందన్న సీఎం... ఉపాధ్యాయులు, భాగస్వాముల్లో అవగాహన కలిగించాలని సూచించారు. మండలానికి ఒకట్రెండు జూనియర్ కళాశాలలు ఉండాలని స్పష్టం చేశారు. ఆట స్థలం లేని స్కూళ్లకు నాడు-నేడు కింద భూమి కొనుగోలు చేయాలని ఆదేశించారు.
వచ్చే ఏడాది నుంచి క్రీడా దుస్తులు, షూ ఇచ్చే అంశం పరిశీలించాలి. స్కూళ్లు, అంగన్‌వాడీల్లో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడం లేదు. ఒక్క కేంద్రాన్ని కూడా మూసివేయడం లేదు. రెండు రకాల పాఠశాలలు ఉండాలన్నది లక్ష్యం. పీపీ-1లో 1, 2 తరగతులకు కిలోమీటర్లలోపు పాఠశాల ఉంటుంది. పీపీ-2లో 3-10 తరగతులకు 3 కిలోమీటర్లలోపు హైస్కూల్ పరిధిలోకి తేవాలి. ఒకే టీచర్ అన్ని పాఠ్యాంశాలు బోధించే విధానం సరికాదు. జులై 1 నుంచి రెండో విడత నాడు-నేడు ప్రారంభించాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
ఇదీ చదవండీ... Mansas Trust: మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్గా ప్రథమ ప్రాధాన్యత విద్యకే: అశోక్ గజపతిరాజు