Review On Corona Cases : రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కొవిడ్ ఉద్ధృతి తీవ్రరూపం దాల్చుతోంది. కేవలం 21 రోజుల్లోనే పాజిటివిటీ రేటు 29.6 శాతానికి చేరింది. కొత్తగా 13వేల 212 మందికి వైరస్ సోకింది. మంత్రి వేణుగోపాలకృష్ణ కరోనా బారిన పడ్డారు. గుంటూరు జిల్లాలో రెండురోజులు వరుసగా వెయ్యికిపైగా కేసులు రావడంతో అధికారులు చర్యలు చేపట్టారు..
గుంటూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. పది రోజుల్లోనే పాజిటివ్ కేసులు అంతకంతకూ అధికమయ్యాయి. పండగవేళ ప్రయాణాలు, వేడుకల్లో పాల్గొనటమే ఈ పరిస్థితికి కారణమని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో యాక్టివ్ కేసుల సంఖ్య 5వేల284కు చేరింది. దీంతోపాటు ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్యా క్రమేపీ పెరుగుతోంది.
గుంటూరు జీజీహెచ్ లో కొవిడ్ కోసం ఏర్పాటు చేసిన పడకలన్నీ రోగులతో నిండిపోయాయి. మొదట్లో రెండు వార్డులు మాత్రమే కొవిడ్ రోగులకు కేటాయించినా... క్రమంగా అవి నిండిపోవటంతో మరో రెండు వార్డులు ఏర్పాటు చేశారు. గత మూడు రోజుల నుంచి రోగుల సంఖ్య అమాంతం పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇతర వ్యాధులతో ఉన్నవారిని అవసరం లేకపోతే డిశ్చార్జ్ చేస్తున్నారు. జీజీహెచ్ లో 11వందల పడకలుండగా, ప్రస్తుతం 200మంది కొవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రమే ఆసుపత్రికి వస్తున్నారు. ఎక్కువ మంది కరోనా రోగులు ఇళ్లలోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి : గుడివాడ ఆస్పత్రి ప్రాంగణంలో ఉద్రిక్తత.. రంగంలోకి పోలీసులు!
విజయనగరం జిల్లా సాలూరు మున్సిపాలిటీ, గ్రామీణ ప్రాంతాల్లో వందల సంఖ్యలో కొవిడ్ పాజటివ్ కేసులు నమోదు అవ్వటంతో జిల్లా వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసరమైతే కేర్ సెంటర్‌కి తరలిస్తామని దానికోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు
అధికారులు వెల్లడించారు. కొవిడ్ కేసుల ఉద్ధృతి నేపథ్యంలో.. కృష్ణా జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుహాసిని రెవెన్యూ అధికారులతో కలిసి కోవిడ్ టెస్టింగ్ ల్యాబుల్లో తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ల్యాబుల్లో ఆర్టీపీసీఆర్ పరీక్ష ఫీజులను వసూలు చేస్తున్నారని గుర్తించారు.
ఇదీ చదవండి : pensions: వృద్ధ పింఛనుదార్లకు పెద్ద షాక్
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!