నెల్లూరు జిల్లా రిజర్వాయర్ పనులకు నిర్వహించిన రివర్స్ టెండరింగ్‌లో 67 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అల్తూరుపాడు రిజర్వాయర్ పనులకు రూ. 253 కోట్ల ఇనీషియల్ బెంచ్ మార్క్ విలువతో టెండర్లు పిలిచామని, ఎనిమిది సంస్థలు బిడ్లు దాఖలు చేశాయని తెలిపింది. 218 కోట్లకు పనులు చేసేందుకు ఓ సంస్థ బిడ్లు దాఖలు చేసిందని జలవనరులశాఖ వివరించింది. ఈ మొత్తానికి రివర్స్ టెండరింగ్ నిర్వహించగా రూ. 157.6 కోట్లకే పనులు చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన బీవీఎస్ఆర్ కన్‌స్ట్రక్షన్ ఎల్ 1గా నిలిచిందని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇనీషియల్ బెంచ్ మార్క్ విలువకంటే 26.72 శాతం తక్కువకు టెండర్ ఖరారైందని ప్రకటించింది. తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 67.8 కోట్ల ఆదా అయినట్లు స్పష్టం చేసింది.
ఇదీ చదవండి : ఏపీకి రూ.33వేల కోట్ల నిధులిచ్చాం: కేంద్ర హోంశాఖ