ETV Bharat / city

'తహసీల్దార్ల కార్యాలయాలపై అనిశా వరుస దాడులు సరికాదు' - ACB Raids in MRO Offices

తహసీల్దార్ల కార్యాలయాలపై అనిశా వరుస దాడులపై రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కొందరి తప్పులను వ్యవస్థకు ఆపాదించడం సరికాదని అభిప్రాయపడింది. పని ఒత్తిడికి తగ్గట్టు సిబ్బంది సంఖ్య పెరగలేదని రెవెన్యూ ఉద్యోగుల సంఘం బాధ్యులు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

Revenue Employees Union Objects ACB Raids on MRO Offices
అనిశా వరుస దాడులపై రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అభ్యంతరం
author img

By

Published : Sep 5, 2020, 3:21 PM IST

తహసీల్దార్ల కార్యాలయాలపై అనిశా వరుస దాడులపై రెవెన్యూ ఉద్యోగుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఆ సంస్థ బాధ్యులు ప్రకటన విడుదల చేశారు. రోజువారీ విధులకు సంబంధించి సోదాలు చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి తప్పులను వ్యవస్థకు ఆపాదించడం సరికాదని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ బాధ్యులు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సంబంధం లేని అంశాల ప్రస్తావనతో ఉద్యోగుల్లో అభద్రతా భావం పెరుగుతోందని వివరించారు. పని ఒత్తిడి తీవ్రమైనా.. సిబ్బంది సంఖ్య పెరగలేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండీ... రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అనిశా దాడులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.