ELECTION CEO: ఓటరు కార్డును ఆధార్‌తో లింక్ చేయాలని సూచిస్తూ ఫోన్లకు మెసేజ్ లు వస్తున్నట్టుగా ఫిర్యాదులు అందుతున్నాయని.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్ తెలిపారు. ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన 1950 కాల్ సెంటర్‌కు ఈ తరహా ఫిర్యాదులు వస్తున్నట్టు గుర్తించామని వెల్లడించారు.
ఎన్నికల ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్‌ను అనుసంధానించాలంటూ భారత ఎన్నికల సంఘం ఎలాంటి ఆదేశాలనూ ఇప్పటి వరకూ జారీ చేయలేదని ఆయన తెలిపారు. ఆధార్ అనుసంధానించే ఎలాంటి లింక్‌నూ ఏపీ ఎన్నికల సంఘం జారీ చేయలేదన్నారు. ఈ తరహా నకిలీ సందేశాలను ప్రతిస్పందించవద్దని ప్రజలకు ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేస్తోందన్నారు.
ఇదీ చదవండి: