కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి బి.ఎన్. యుగంధర్ కన్నుమూశారు..కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఈయన కుమారుడే. 1962 ఐఏఎస్ బ్యాచ్ అధికారి అయిన యుగంధర్ అనేక కీలక స్థానాల్లో విధులు నిర్వర్తించారు. నిజాయతీ కలిగిన ఐఏఎస్ అధికారిగా.. ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం తపించిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో ప్రణాళికాసంఘంలో సభ్యుడిగా సేవలందించారు. ప్రధాని కార్యదర్శిగానూ పనిచేశారు. ముస్సోరీలోని లాల్ బహుదూర్ శాస్త్రి ఐఏఎస్ అకాడమీకి డైరక్టర్గానూ సేవలందించారు. అంతకు ముందు ఆయన పీవీ నరసింహారావు ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా పనిచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వాటర్ షెడ్ డవలప్మెంట్కు రాష్ట్రాలతో సంబంధం లేకుండా నేరుగా కేంద్రం నుంచే నిధులు అందేలా కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. తొలినాళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళంతో పాటు..కొన్ని జిల్లాల్లో కలెక్టరుగా సేవలందించారు. రాష్ట్రంలో ముఖ్య కార్యదర్శి హోదాలో పనిచేసిన ఆయన తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్లారు.
విశ్రాంత ఐఏఎస్ యుగంధర్ నాదెళ్ల కన్నుమూత - విశ్రాంత ఐఏఎస్
మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి బి.ఎన్.యుగంధర్ (81) కన్నుమూశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి బి.ఎన్. యుగంధర్ కన్నుమూశారు..కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఈయన కుమారుడే. 1962 ఐఏఎస్ బ్యాచ్ అధికారి అయిన యుగంధర్ అనేక కీలక స్థానాల్లో విధులు నిర్వర్తించారు. నిజాయతీ కలిగిన ఐఏఎస్ అధికారిగా.. ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం తపించిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో ప్రణాళికాసంఘంలో సభ్యుడిగా సేవలందించారు. ప్రధాని కార్యదర్శిగానూ పనిచేశారు. ముస్సోరీలోని లాల్ బహుదూర్ శాస్త్రి ఐఏఎస్ అకాడమీకి డైరక్టర్గానూ సేవలందించారు. అంతకు ముందు ఆయన పీవీ నరసింహారావు ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా పనిచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వాటర్ షెడ్ డవలప్మెంట్కు రాష్ట్రాలతో సంబంధం లేకుండా నేరుగా కేంద్రం నుంచే నిధులు అందేలా కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. తొలినాళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళంతో పాటు..కొన్ని జిల్లాల్లో కలెక్టరుగా సేవలందించారు. రాష్ట్రంలో ముఖ్య కార్యదర్శి హోదాలో పనిచేసిన ఆయన తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్లారు.
anc
గోవా జామ పై అన్నదాత కథనం
Body:గోవా జామ
Conclusion: రాజా నెల్లూరు 9394450293