Retired IAS Office PV Ramesh: అధికారులకు కోర్టులు శిక్ష విధించడం అరుదని విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ అన్నారు. న్యాయవ్యవస్థ ఆదేశాలను అధికారులు పాటించాల్సిందే అని స్పష్టం చేశారు. ఆదేశాలు పాటించని వారిని శిక్షించే అధికారం కోర్టులకు ఉందని గుర్తుచేశారు. ఇప్పుడు అధికారుల్లోనూ విభజన వచ్చిందని...మంచిపోస్టు, చెడ్డ పోస్టు అంటూ వ్యత్యాసం చూపుతున్నారన్నారు.
నేతలకు దగ్గరగా ఉంటే మంచి పోస్టు వస్తుందన్న భావన పెరిగిపోయిందని తెలిపారు. ప్రాంతీయం, కులం వంటి జాడ్యాలు వచ్చి చేరాయన్నారు. భయపెట్టి పనిచేయిస్తున్నారని ఎవరైనా చెబితే నమ్మడం కష్టమే అన్నారు. ప్రజలకు సేవ చేసే ఏ పోస్టు అయినా మంచిదే అని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: Banjarahills pub case: పబ్‌లో తరచూ డ్రగ్స్ పార్టీలు.. హై ప్రొఫైల్ అతిథులు