ద్విచక్రవాహనాన్ని ఇంటి బయట పెడితే కోతులు, ఎలుకలు గందరగోళం సృష్టించగా.. దీని నివారణకు ఓ రక్షణ కవచం ఏర్పాటు చేశారు విశ్రాంత రైల్వే ఉద్యోగి రాజేందర్. ఉద్యోగ విరమణ అనంతరం తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బేగంపేట గ్రామ శివారులోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆయన నివాసముంటున్నారు. ఆ ప్రాంతాల్లో వానరాలు, ఎలుకల బెడద తీవ్రంగా ఉండడం వల్ల ఆయన ద్విచక్రవాహనాన్ని కాపాడుకోవడానికి ఓ ఉపాయం ఆలోచించారు.
ద్విచక్ర వాహనాన్ని బయట నిలిపి ఉంచితే కోతులు బైక్‌పై గెంతులేస్తున్నాయి. రాత్రివేళల్లో ఎలుకలు చొరబడి తీగలను కొరికేస్తున్నాయి. వీటి బెడద నివారణకు ఇనుపరాడ్లతో పెట్టె తయారుచేసి చుట్టూ జాలి బిగించాను. తాళం వేసుకునేలా ఏర్పాటు చేసుకున్నాను. ఇనుప పెట్టెలో వాహనం ఇప్పుడు భద్రంగా ఉంటోంది.
-రాజేందర్, విశ్రాంత రైల్వే ఉద్యోగి
ఇదీ చదవండి: