చంద్రబాబు, నారాయణపై సీఐడీ కేసు విచారణను హైకోర్టు నిలుపుదల చేయడాన్ని తెలుగుదేశం నేతలు స్వాగతించారు. తప్పుడు కేసులు పెట్టినప్పుడే కోర్టులు స్టే ఇస్తాయనే విషయం వైకాపా నేతలు తెలుసుకోవాలని సూచించారు. ఇకనైనా ఇలాంటి తప్పుడు కేసుల జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడాలన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసుల నమోదు, కోర్టులో చీవాట్లు జగన్ కుటుంబానికి అలవాటేనని... తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తారు. ఈమేరకు ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్టు చేశారు. సీఐడీ అక్రమ కేసుపై న్యాయస్థానం స్టే ఇచ్చిన తర్వాతైనా వైకాపా నేతలు కళ్లు తెరవాలని... తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, వర్ల రామయ్య హితవు పలికారు.
ఇదీ చదవండీ... 'సీఆర్‌డీఏ చట్టం ప్రకారం ప్రాసిక్యూషన్‌పై నిషేధం ఉంది'