తెదేపా అధినేత చంద్రబాబు వైకాపా నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తల ఇళ్లపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. భూములు సాగు చేసుకోనివ్వకుండా..గ్రామాలను ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. మనది స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యమని పౌరులందరికి నివసించే హక్కుందని గుర్తు చేశారు. ప్రజల భావవ్యక్తీకరణ హక్కులను కాలరాస్తూ..అధికారం ఉందని ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. వైకాపా వేధింపులకు నిరసనగా సెప్టెంబర్ 3 నుంచి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామన్నారు. మంగళవారం నుంచి గుంటూరులో వైసీపీ భాధితులకు పునరాశ్రయ శిబిరాన్ని నిర్వహిస్తామన్నారు. పల్నాడు సహా ఇతర ప్రాంతాల్లో వైకాపా కారణంగా నివాసాలు కోల్పోయిన బాధితులందరికీ గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు శిబిరంలో ఆశ్రయం కల్పిస్తామన్నారు. వారికి న్యాయపరంగా రక్షణ కల్పిస్తామని భరోసానిచ్చారు.
ఇదీచదవండి