చర్మం అందంగా కనిపించాలంటే రోజూ 8-12 గ్లాసుల నీళ్లు తప్పనిసరిగా తాగాలి. అలాగే స్కిన్ వైటెనింగ్ కోసం బీట్‌రూట్ తినాలి. దానివల్ల చర్మ ఛాయ పెరగడంతో పాటు హెమోగ్లోబిన్ స్థాయి పెరుదలకు దోహదం చేస్తుంది. దీనితో పాటు క్యారట్, పుచ్చకాయ.. వంటివి మీరు రోజువారీ ఆహారంలో తప్పకుండా భాగం చేసుకోవాలి. వీటిని పచ్చిగా తినడం ఇష్టం లేకపోతే రసం చేసుకొనైనా తాగచ్చు. ఇలా మూడు నెలల పాటు తీసుకుంటే మీ చర్మ ఛాయలో తప్పకుండా మార్పు కనిపిస్తుంది. ఈ ఆహారం వల్ల చర్మానికి లోలోపలి నుంచి మెరుపు వస్తుంది. ఇలా వచ్చిన గ్లో దాదాపు 15 రోజుల వరకు నిలిచి ఉంటుంది.
ఆకలి వేస్తే చర్మ రంగు మారుతుందా..
అలాగే ఆకలి వేసినా చర్మ రంగు మారిపోతుందని కొందరు అంటారు. శరీరంలో నీటి స్థాయులు తగ్గిపోవడం వల్ల ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది.. అందుకే మీ చర్మ ఛాయ తగ్గుతున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో ఉత్పత్తయ్యే ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు. దీంతో పాటు కీరా ముక్కలు తినడం వల్ల కూడా అటు శరీరం తేమగా మారడంతో పాటు చర్మం లోలోపలి నుంచి కాంతివంతంగా తయారవుతుంది.
జిడ్డుగా మారుతున్నారా..
చర్మం జిడ్డు అవుతున్న సమస్య నుంచి బయటపడాలంటే గంధం ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది. ఇందుకోసం.. గంధం, రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా తయారుచేసుకొని రాత్రి పడుకునే ముందు ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇలా 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచుకొని కడిగేసుకుంటే జిడ్డు తొలగిపోతుంది. ఈ చిట్కాలన్నీ క్రమం తప్పకుండా మూడు నెలల పాటు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.
చివరిగా ఒక్క మాట..
శరీరం రంగేదైనా మన మొహంలో ఆత్మ విశ్వాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటే అంతకు మించిన కళ ఏదీ ఉండదన్నది గుర్తు పెట్టుకోండి. నలుపా, తెలుపా అన్నది మర్చిపోయి తిరుగులేని ఆత్మ విశ్వాసంతో ముందుకు దూసుకుపోండి!
ఇదీ చదవండి: