ETV Bharat / city

భారత మార్కెట్​లోకి రియల్‌మీ జిటి నియో 2.. ఫీచర్స్​ ఇవే..! - realme GT neo2

రియల్‌మి జిటి నియో 2 భారతదేశంలో లాంచ్ అయింది. ఈ సరికొత్త రియల్‌మి జిటి ఫోన్ రియల్‌మి జిటి నియోకి హంగులు జోడించి లేటెస్ట్​గా తీసుకొచ్చారు. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.

realme GT neo2
realme GT neo2
author img

By

Published : Oct 13, 2021, 6:29 PM IST

రియల్‌మి జిటి నియో2 భారతదేశంలో లాంచ్ అయింది. ఈ సరికొత్త రియల్‌మి జిటి ఫోన్ రియల్‌మి జిటి నియోకి హంగులు జోడించి లేటెస్ట్​గా తీసుకొచ్చారు. మేలో రియల్‌మి ఎక్స్ 7 మ్యాక్స్‌గా భారత్​లో ఈ వెర్షన్​ను లాంచ్ చేశారు. ఈ Realme GT Neo 2 120Hz AMOLED డిస్‌ప్లేను, ట్రిపుల్ రియర్ కెమెరాలతో వస్తోంది. భారతీయ టెలికాం ఆపరేటర్లు తమ తదుపరి తరం సెల్యులార్ నెట్‌వర్క్ 5జీ సేవలను దేశంలో ఇంకా ప్రారంభించకున్నా... ఈ ఫోన్ 5G కనెక్టివిటీతో వస్తోంది. రియల్‌మి జిటి నియో2లో.. డాల్బీ అట్మోస్ సపోర్ట్ స్టీరియో స్పీకర్లు, 65W వేగవంతమైన ఛార్జింగ్, ఉష్ణోగ్రతల నిర్వహణ కోసం స్టెయిన్‌లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ సిస్టమ్, హీట్-సింక్ చాంబర్‌ వంటి అద్భుతమైన ఫీచర్లు పొందుపరిచారు. రియల్‌మి జిటి నియో2... శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 52, ఎంఐ 11ఎక్స్ 5జి, పోకో ఎఫ్ 3 జిటి వంటి సమాన శ్రేణి స్మార్ట్​ ఫోన్​లతో పోటీపడనుంది.

భారతదేశంలో Realme GT Neo 2 ధర, లభ్యత

భారతదేశంలో Realme GT Neo 2 ధర బేసికి మోడల్ అయిన 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్​కు రూ.31,999, 12GB + 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో వస్తున్న వేరియంట్ ధర రూ.35,999. ఇది నియో బ్లాక్, నియో బ్లూ, నియో గ్రీన్ వంటి మూడు విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

రియల్‌మే జిటి నియో2ను.. అక్టోబర్ 17నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి డాట్ కామ్ లతో పాటు దేశంలోని మెయిన్లాండ్​ ప్రధాన రిటైల్ స్టోర్‌ల ద్వారా విక్రయిస్తారు. రియల్‌మి జిటి నియో 2 లాంచ్ ఆఫర్‌లో భాగంగా గరిష్టంగా ఈ పండుగ సీజన్ అమ్మకాల్లో రూ. 7,000 వరకు తగ్గింపు లభించే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యుల కోసం, ఈ ఫోన్ అక్టోబర్ 16 మధ్యాహ్నం 12 గంటల నుండి అందుబాటులో ఉంటుంది.

రియల్‌మి GT నియో 2 బేస్ 8GB + 128GB వేరియంట్ సుమారు రూ. 29,300 ప్రారంభ ధరతో,.. 12GB + 256GB మోడల్ ధర CNY 2,999(సుమారు రూ. 35,100)తో గత నెలలోనే చైనాలో ప్రారంభమైంది.

రియల్‌మి జిటి నియో 2 స్పెసిఫికేషన్‌లు

డ్యుయల్-సిమ్ (నానో) రియల్‌మి జిటి నియో 2 వేరియంట్... ఆండ్రాయిడ్ 11పై రియల్‌మి యుఐ 2.0తో కూడి నడుస్తుంది. ఇది 120 హెర్ట్డ్ రిఫ్రెష్ రేట్ కలిగిన 6.62అంగుళాల ఫుల్ హెచ్‌డి+ శామ్‌సంగ్ ఇ4 డిస్‌ప్లేతో, 1,300నిట్స్ బ్రైట్‌నెస్, డిసి డిమ్మింగ్‌ సామర్థ్యంతో వస్తుంది.

రియల్‌మి జిటి నియో 2 క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 870 చిప్, 12జిబి ర్యామ్​తో ఉంది. ఈ ఫోన్ 7GB వరకు వర్చువల్ మెమరీకి మద్దతు ఇస్తుంది, ఇది మెరుగైన వినియోగ అనుభవాన్ని అందించడానికి ఉపయోగ పడ్తుంది.

ఫోటోలు, వీడియోల కోసం, రియల్‌మి జిటి నియో2.. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ని కలిగి ఉంది. ఇందులో 64మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్, అలాగే.. 2మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉన్నాయి. ఈ ఫోన్ ముందు భాగంలో 16మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

కొత్త Realme GT Neo 2లో 256GB వరకు UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. కనెక్టివిటీ కోసం 5G, 4G LTE, Wi-Fi, Bluetooth, GPS/ A-GPS, NFC, అలాగే USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా పొందుపరిచారు.

రియల్‌మి జిటి నియో2లో 5,000mAh బ్యాటరీని ఉంటుంది. ఇది 65W సూపర్‌డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అంటే 36 నిమిషాల్లో ఫోన్‌ను సున్నా నుండి 100 శాతం వరకు పూర్తిగా ఛార్జ్ చేస్తుంది.

ఇదీ చదవండి : 'మన సార్​ వచ్చాక కమీషన్ల వాటా పెరిగింది'.. కాంగ్రెస్​ నేతల వీడియో వైరల్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.