ETV Bharat / city

తటాకం ఉగ్రరూపం.. వెంచర్లను ముంచిన రావిర్యాల పెద్దచెరువు - రావిర్యాల పెద్దచెరువు తాజా వార్త

భారీ వర్షాలతో రాజధాని హైదరాబాద్ శివారులో చెరువులు నిండుతుండటం వల్ల జల వనరులు ఆక్రమించి స్థిరాస్తి వ్యాపారులు సాగించిన అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. చేసిన పాపం ఊరికే పోదు అన్నట్లుగా చెరువు నిండి వెంచర్లను ముంచేసింది. దీనితో ప్లాట్లు కొనుగోలు చేసిన లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.

raviryal-pedda-cheruvu
వెంచర్లను ముంచిన రావిర్యాల పెద్దచెరువు
author img

By

Published : Oct 28, 2020, 2:14 PM IST

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల పెద్దచెరువు వెయ్యి ఎకరాల్లో విస్తరించింది. ఇందులో 855 ఎకరాల్లో పూర్తి నీటినిల్వ సామర్థ్యం(ఎఫ్‌టీఎల్‌)గా ఉంది. దీని కింద 1086 ఎకరాల్లో ఆయకట్టు ఉంది. చెరువు శిఖం భూముల్లో ప్రైవేటు పట్టా భూములు ఉండటం.. పైగా తటాకం శ్రీశైలం జాతీయ రహదారి పక్కనే ఉండటం వల్ల స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. చెరువు భూములను వెంచర్లు చేసి అమాయకులకు వల వేసి ప్లాట్లు విక్రయించారు.

నిబంధనలు ఏం చెబుతున్నాయ్‌..?

చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ప్రైవేటు భూములుంటే వ్యవసాయానికి తప్ప మరే ఇతర కార్యకలాపాలకు వినియోగించరాదు. దీన్ని పట్టించుకోకుండా రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి వ్యాపారులు వెంచర్లు వేశారు. దీనిపై స్థానిక రైతులు గతంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ వెంచర్‌ భూములు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో లేవంటూ స్థిరాస్తి వ్యాపారులు అడ్డగోలుగా వాదిస్తూ వచ్చారు. తాజాగా పడిన భారీ వర్షాలతో 30ఏళ్ల తర్వాత చెరువు నిండుతుండటం వల్ల వ్యాపారుల అక్రమాలు బట్టబయలయ్యాయి. చెరువు ఎఫ్‌టీఎల్‌ ప్రాంతంలోని 600 ఎకరాల్లో నీరు చేరడం వల్ల వెంచర్లు నీట మునిగాయి.

నిండా మునిగిన ప్రముఖులు

చెరువుకు మరోవైపు స్థిరాస్తి వ్యాపారులు మరో భారీ వెంచర్‌ వేశారు. రైతుల నుంచి భూములు సేకరించి జీపీఏ తీసుకున్నారు. అనంతరం ప్రముఖులకు ఫార్మ్‌హౌస్‌ల కోసం ఎకరాల కొద్దీ విక్రయించారు. వీరిలో క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖులున్నారు. ప్రస్తుతం ఈ భూములన్నీ నీట మునిగాయి. ఇక చెరువు ఎఫ్‌టీఎల్‌లోనే మరో 30 ఎకరాల్లో ఇంకో వెంచర్‌ ఉంది. అందులోకి రాకుండా అడ్డుగా మట్టికట్టగా పోసి చెరువు ప్రహహాన్ని అడ్డుకున్నారు. మట్టికట్ట వరకు నీరు వచ్చి వెంచర్‌లోకి వెళ్లకుండా ఆగిపోయాయి.

ఎన్‌వోసీ లేకపోయినా..

నాలుగేళ్ల కిందట చెరువు నీటికి అడ్డుకట్ట కట్టి స్థిరాస్తి వ్యాపారులు 68 ఎకరాల్లో వెంచర్‌ వేశారు. ప్రస్తుతం 55 ఎకరాల్లో చెరువు నీరు చేరింది. అప్పట్లో స్థిరాస్తి వ్యాపారులతో లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీ సభ్యులు కుమ్మక్కై వెంచర్‌ అనుమతికి సిఫార్సు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే హెచ్‌ఎండీఏ అధికారులూ అప్పట్లో తాత్కాలిక అనుమతులిచ్చారు. దాదాపు 80 శాతం ప్లాట్లను వ్యాపారులు విక్రయించేశారు. తర్వాత పూర్తిస్థాయి అనుమతుల కోసమని నిరభ్యంతర పత్రం పొందేందుకు రంగారెడ్డి జిల్లా అధికారులకు దరఖాస్తు చేసుకోగా.. తిరస్కరించారు. ఇది తెలియక అమాయకులు ప్లాట్లు కొనుగోలు చేసి నిండా మునిగారు.

సర్వే అడ్డగింత

నాలుగేళ్లుగా రెవెన్యూ, నీటిపారుదల శాఖాధికారులు ఎఫ్‌టీఎల్‌ సరిహద్దులు గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ అక్రమాలు బయటపడతాయని ఎప్పటికప్పుడు స్థిరాస్తి వ్యాపారులు అడ్డుకుంటున్నారు. హద్దురాళ్లు తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు. తాజాగా ఆయా వెంచర్లలో ప్రహరీ పది అడుగుల ఎత్తులో ఉండగా 8 అడుగుల మేర నీట మునిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్ఛు

ఎన్‌వోసీ ఇవ్వలేదు

చెరువు 40శాతం నిండింది. ఎగువ నుంచి వరద వస్తుండటం వల్ల పూర్తిగా నిండే వీలుందని నీటి పారుదల శాఖ డీఈ విక్రమ్ తెలిపారు. ఇప్పటికే చెరువు ఎఫ్‌టీఎల్‌లో వెంచర్‌ చేసినట్లు చాలా ఫిర్యాదులొచ్చాయి. దీనిపై నోటీసులు జారీ చేశాం. అలాగే వెంచర్‌ నిర్వాహకులు ఎన్‌వోసీకి దరఖాస్తు చేసుకోగా తిరస్కరించాం. త్వరలో మరోసారి సర్వే చేపడతామని విక్రమ్​ చెప్పారు..

సంయుక్త సర్వే చేపడతాం

చెరువు ఎఫ్‌టీఎల్‌పై నీటి పారుదల శాఖతో కలిసి సంయుక్త సర్వే చేపడతామని మహేశ్వరం తహసీల్దారు జ్యోతి తెలిపారు. ఎఫ్‌టీఎల్‌లో వేసిన వెంచర్లలోకి నీరు వచ్చినట్లు మాకు ఫిర్యాదులొచ్చాయి. సర్వే చేసి సరిహద్దులు గుర్తిస్తామన్నారు.

ఇదీ చూడండి:
మిస్ టీన్ తెలుగు యూనివర్స్‌గా ఎంపికైన నిత్యా కొడాలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.