ETV Bharat / city

అత్యాచారం జరిగిందని చెప్పిన భార్య... తేలిగ్గా తీసుకున్న భర్త - malkajigiri rape news

మూఢనమ్మకాలను నమ్మే ఓ వ్యక్తి తన భార్యను ఓ మంత్రగాడి చేతిలో పెట్టాడు. సదురు వ్యక్తి బలహీనతను అలుసుగా తీసుకున్న ఆ మాయలోడు పూజలు పుణస్కారాలంటూ... ఆమెపై అత్యాచారం చేశాడు. జరిగిన ఘటన గురించి భర్తకు మొరపెట్టుకోగా... చాలా తేలిగ్గా తీసుకున్నాడు. పైగా ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించగా.. నివ్వెరపోవడం భార్య వంతైంది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో జరిగింది

rape on woman in malkajigiri hyderabad
మల్కాజిగిరిలో మహిళపై అత్యాాచారం
author img

By

Published : Jun 29, 2020, 1:37 PM IST

భార్యకు దెయ్యం పట్టిందని మంత్రగాడిని ఆశ్రయించాడు ఓ వ్యక్తి. సదురు మాయలోడు ఆమెకు పట్టిన దెయ్యాన్ని వదిలిస్తానంటూ... మహిళపై అత్యాచారం చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో జరిగింది . మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మౌలాలీ ఈస్ట్ ప్రగతినగర్​లో మహమ్మద్ అజీజ్ కుటుంబం నివసిస్తోంది. కొన్ని రోజులు భార్యకు దెయ్యం పట్టిందని మూఢనమ్మకం పెంచుకున్నాడు. భార్యకు పట్టిన దెయ్యాన్ని వదిలించేందుకు మౌలాలీలోని మంత్రగాడిని ఆశ్రయించాడు. తన భార్యకు మంత్రగాడు ఏం చెప్పినా చేయాలని చెప్పి... వదిలేసి వెళ్లిపోయాడు.

పూజలంటూ...

ఆమెను గదిలోకి తీసుకెళ్లిన ఆ మాయలోడు... కాసేపు పూజలు చేస్తున్నట్టు నటించి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కాసేపటికి అక్కడకు చేరుకున్న భర్త... ఏమీ తెలియనట్లు బాధితురాలిని తీసుకుని వెళ్లిపోయాడు. ఇంటికెళ్లాక జరిగిన విషయాన్ని భర్తకు చెప్పగా... అతడు దాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నాడు. పైగా ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు.

ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు... మంత్రగాడిని, బాధితురాలి భర్తను అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చూడండి: ఊపిరాడ్తలేదు డాడీ.. సెల్ఫీ వీడియోలో కరోనా బాధితుడి ఆర్తనాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.