ETV Bharat / city

హైకోర్టు తీర్పు ప్రకారం మళ్లీ పదవిలోకి వచ్చా: నిమ్మగడ్డ

author img

By

Published : May 29, 2020, 12:01 PM IST

Updated : May 29, 2020, 2:04 PM IST

ramesh kumar nimmagadda
ramesh kumar nimmagadda

12:00 May 29

breaking

హైకోర్టు తీర్పుతో తిరిగి ఎస్​ఈసీగా బాధ్యతలు స్వీకరించినట్లు రమేష్ కుమార్ తెలిపారు. వ్యక్తుల కన్నా వ్యవస్థ గొప్పదని వాటిని కాపాడాల్సిన బాధ్యత ఉన్నత స్థానాల్లో ఉన్నవారికి ఉందని చెప్పారు.  

కోర్టు తీర్పు తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా రమేష్​కుమార్ తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియను త్వరలోనే తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. హైకోర్టు తీర్పు అనంతరం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 

ప్రకటన పూర్తి సారాంశం:

వ్యక్తికన్నా వ్యవస్థ గొప్పది

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు తిరిగి నేను విధుల్లో చేరాను. గతంలో వ్యవహరించిన మాదిరిగానే నేను నా విధులను నిష్పక్షపాతంగా నిర్వర్తిస్తాను. పరిస్థితులు చక్కబడిన వెంటనే రాష్ట్రంలో ఆగిపోయిన ఎన్నికల ప్రక్రియను తిరిగి చేపడతాను. ఇందులో భాగస్వామ్యమైన వ్యక్తులతో రాజకీయ పార్టీలతో చర్చించిన మీదట ముందుకెళ్తాం. వ్యక్తులు ఎప్పుడూ శాశ్వతం కాదు. రాజ్యాంగ వ్యవస్థలు, అవి పాటించే విలువలే శాశ్వతం. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేసి ఆ పదవుల్లోకి వచ్చిన వారికి ఆ వ్యవస్థలను రక్షించాల్సిన ఆవశ్యకత, వాటి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంటాయి.  -నిమ్మగడ్డ రమేశ్ కుమార్ 

ఇదీ చదవండి:

ఎస్​ఈసీ వ్యవహారం.. ఎవరేమన్నారంటే..?

Last Updated : May 29, 2020, 2:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.