ETV Bharat / city

హైకోర్టును ఆశ్రయించిన రమేశ్ ఆసుపత్రి ఎండీ - ramesh hospital md news

స్వర్ణ ప్యాలెస్​లో జరిగిన అగ్నిప్రమాదానికి తనకు సంబంధం లేదనీ.. గవర్నర్​పేట పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని... రమేష్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ పీ. రమేశ్​బాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.

high court
హైకోర్టును ఆశ్రయించిన రమేశ్ ఆసుపత్రి ఎండీ
author img

By

Published : Aug 18, 2020, 9:37 AM IST

రమేష్ కార్డియాక్ మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రి ఎండీ డాక్టర్ పీ.రమేశ్​బాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటన విషయంలో గవర్నర్​పేట పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని, ఈ వ్యాజ్యం తుది విచారణ తేలేంత వరకు పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. స్వర్ణ ప్యాలెస్ హోటల్లో కొవిడ్ కేంద్రంలో చికిత్స అందించేందుకు జిల్లా వైద్యాధికారి అనుమతిచ్చినట్లు డాక్టర్ రమేష్ బాబు పిటిషన్​లో పేర్కొన్నారు. స్వర్ణ ప్యాలెస్ కొవిడ్ కేంద్రంలో చోటు చేసుకున్న ప్రమాద ఘటనతో తనకు సంబంధం లేదన్నారు . ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని తనపై పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలను నిలువరించాలని అభ్యర్థించారు . నేడు ఈ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరపనుంది. రమేష్ కార్డియాక్ మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రి ఛైర్మన్ సీతారామమోహన్ రావు ఇదే అభ్యర్ధనతో హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలు చేశారు.

ఇదీ చదవండి: 'లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.