తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని రామప్ప ఆలయం (Ramappa Temple) గురువారం త్రివర్ణ కాంతులతో వెలుగులీనింది. దేశంలో 100 కోట్ల మందికి కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు.. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం (Ramappa Temple)పై కేంద్ర పురావస్తుశాఖ జాతీయ జెండా రంగులు ప్రతిబింబించేలా విద్యుత్తు దీపాలతో అలంకరించింది.
కాకతీయుల కళలకు నిలువెత్తు నిదర్శనం రామప్ప దేవాలయం (Ramappa Temple).. కాకతీయుల రాజధాని వరంగల్ (ప్రస్తుతం ములుగు జిల్లా పాలంపేట గ్రామం)లో కీ.శ.1213లో కాకతీయ గణపతి దేవుడి కాలంలో రేచర్ల రుద్రుడు.. రామప్ప ఆలయాన్ని (Ramappa Temple) నిర్మించారు. ఈ ఆలయం (Ramappa Temple)లో రామలింగేశ్వరుడు(ఏకశిల) కొలువై ఉన్నాడు. ఆలయ గోపురాన్ని నీటిపై తేలియాడే ఇటుకలతో నిర్మించారు. ఈ (Ramappa Temple) ఆలయానికి యునిస్కో గుర్తింపు లభించింది.
రామప్ప దేవాలయాన్ని (Ramappa Temple) క్రీస్తు శకం 1213లో గణపతి దేవుడుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు కట్టించాడు. 40 ఏళ్ల పాటు శ్రమించి ఈ దేవాలయాన్ని నిర్మించారు. సాధారణంగా ఆలయంలో ఉన్న దేవుడి పేరు మీదుగా గుడి పేరు ఉంటుంది. కానీ రామప్ప దేవాలయం (Ramappa Temple) దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండటం ఇక్కడి విశేషం. ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం (Ramappa Temple) అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయం (Ramappa Temple)లో ప్రధాన దైవం రామలింగేశ్వరుడు. ఈ ఆలయం తూర్పు దిశాభిముఖంగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగాన మూడు వైపుల ప్రవేశ ద్వారంతో కలిగి మహామండపం ఉంది. గర్భాలయంలో ఎత్తైన పీఠంపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగం ఉంటుంది.
ఆలయ మహామండపం మధ్య భాగాన కల కుడ్య స్తంభాలు, వాటిపై గల రాతి దూలాలు రామాయణ, పురాణ, ఇతిహాస గాథలతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పాలు కలిగి ఉన్నాయి. ఈ మహామండపం వెలుపలి అంచున పైకప్పు కింది భాగాన నల్లని నునుపు రాతి పలకంపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరంగా చెక్కబడిన మదనిక, నాగిని శిల్పాలు కాకతీయుల శిల్పకళాభిరుచులకు చక్కటి తార్కాణాలుగా నిలిచాయి. ఈ దేవాలయ ప్రాంగణంలో ఇతర కట్టడాలలో నంది మండపం, కామేశ్వర, కాటేశ్వర మొదలగు ఆలయాలు చూడదగినవి. రామప్ప ఆలయాన్ని అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మించారు. ఈ ఇటుకలు నీటి మీద తేలే అంత తేలికైనవి అని చెబుతారు. ఇక్కడ ఆలయాని (Ramappa Temple)కి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఏ దిశనుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లుంటుంది. ఆలయ నిర్మాణానికి నల్ల డోలోమైట్, గ్రానైట్, శాండ్‌స్టోన్‌ను వినియోగించారు. ఆలయం చుట్టూ ఉన్న మదనికలు కాకతీయ అద్భుత శిల్పకళా చాతుర్యానికి ప్రతీకలు.
ఇదీ చూడండి: VIJAYAWADA: ఇంద్రకీలాద్రిపై రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు