దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంపై మరో ఉపరితల ద్రోణి అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడి ఉన్నట్టు స్పష్టం చేసింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు తెలియచేసింది. కోస్తాంధ్రలోని ఇతర జిల్లాల్లోనూ అల్పపీడనం ప్రభావంతో కొన్ని చోట్ల వర్షాలకు ఆస్కారం ఉందని స్ఫష్టం చేసింది. 29 తేదీ నుంచి రాయలసీమ జిల్లాలు, కోస్తాంధ్ర అంతటా విస్తారంగా వర్షాలు పడే అవకాశముందని (భారత వాతావరణ కేంద్ర) ఐఎండీ వెల్లడించింది.
ఇదీ చదవండి: MP VIJAYASAI REDDY: అమిత్షా అందుకే అపాయింట్మెంట్ ఇవ్వలేదు: విజయసాయి