నైరుతి రుతుపవనాలు ఆదివారం దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. వచ్చే 12 గంటల్లో ఆయా ప్రాంతాల్లో మరింత విస్తరించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు.కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. మంగళవారం ఉత్తర కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయి.
ఇదీ చదవండి: