రాష్ట్రానికి చల్లని కబురు అందింది. రాబోయే 3 రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో... మరట్వాడా మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని తెలిపింది. ఉత్తర - దక్షిణ ద్రోణి, మరట్వాడా నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర కర్ణాటక, రాయలసీమ వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడినట్టు వెల్లడించింది.
ఇదీ చదవండి: