ETV Bharat / city

హైదరాబాద్​లో వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఎల్బీనగర్​, నాగోల్​, మన్సురాబాద్​, వనస్థలిపురం, బీఎన్​రెడ్డి నగర్​, హయత్​నగర్​, అబ్దుల్లాపూర్​మెట్​లో మోస్తరుగా వర్షం పడింది.

rain-in-hyderabad-city
హైదరాబాద్​లో వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం
author img

By

Published : Sep 11, 2020, 7:29 PM IST

హైదరాబాద్​లో వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం

హైదరాబాద్​లోని చాలాచోట్ల వాన పడింది. ఓయూ, తార్నాక, హబ్సిగూడ, మల్లాపూర్​, ఎల్బీనగర్​, నాగోల్​, మన్సురాబాద్​, వనస్థలిపురం, బీఎన్​రెడ్డి నగర్​, హయత్​నగర్​, అబ్దుల్లాపూర్​మెట్​లో మోస్తరు వర్షం కురిసింది. వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రోడ్లపైకి వర్షపు నీరు చేరడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వాన నీటితో డ్రైనేజీలు పొంగిపొర్లాయి.

హబ్సీగూడ చౌరస్తా, ఎల్బీనగర్​, తార్నాకలో ట్రాఫిక్​కు స్వల్ప​ అంతరాయం ఏర్పడింది. ఉద్యోగులు కార్యాలయాల నుంచి వచ్చే సమయంలో వర్షం కురవటంతో వారు ఇబ్బంది పడ్డారు. నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావణ శాఖ తెలపటంతో జీహెచ్​ఎంసీ అప్రమత్తమైంది. ఎక్కడైనా నీరు నిలిచిపోతే నీటిని తోడేందుకు మోటార్లు సిద్ధం చేసింది.

ఇదీ చదవండి: ఒకేసారి నలుగురు బిడ్డలకు తల్లయింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.