ETV Bharat / city

రెయిన్​కోట్స్ ఎత్తుకెళ్తున్నాడు.. ఆడవాళ్లవి మాత్రమే!

"పురుషులంతా చూడ్డానికి ఒకేలా కనిపిస్తారు.. బట్, పుణ్యపురుష్​ ఈజ్ డిఫరెంట్" అన్నాడు వేమన. దొంగలు కూడా అంతే! పేరు ఒక్కటే అయినా.. వాళ్ల ప్రొఫెషన్ మస్తు డిఫరెంట్​గా ఉంటుంది. ఒకడు డబ్బులు మాత్రమే దొంగిలిస్తే.. మరొకడు గోల్డే కొట్టేస్తాడు.. ఇంకొకడు బైక్​లు మాత్రమే మాయం చేస్తాడు. కానీ.. వీడెవడో "చోర్ డిఫరెంట్" అనే బ్యాచ్​కు హెడ్మాస్టర్​లా ఉన్నాడు. రెయిన్​ కోట్లు ఎత్తుకెళ్తున్నాడు. ఇందులో కూడా స్పెషలైజేషన్ ఉంది.. ఆడవాళ్లవి మాత్రమే లేపేస్తున్నాడు.. "ఎందుకురా ఇలా!" అంటే.. ఏం చెప్పాడో తెలుసా??

rain coat
rain coat
author img

By

Published : Sep 30, 2022, 3:55 PM IST

శరీరానికి వయసు ఉంటుంది గానీ.. మనసుకు ఉంటుందా? ఫీలింగ్స్​కు ఉంటుందా..?? ఉండదుకదా.. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే.. మన స్టోరీలో దొంగ 50ఏళ్లు దాటేసినవాడు మరి! సమాజానికి భయపడో.. అవగాహన పెరగడం ద్వారానో.. "చేయకూడని" పనులు చేయాలన్న కోరికను నిగ్రహించుకుంటారు చాలా మంది. కొందరు మాత్రం తమకు పరిధులు లేవని బాహాటంగా ప్రకటించుకోవడం ద్వారా.. సెల్ఫ్​ లైసెన్స్ ఇచ్చేసుకుంటారు. ఇవి రెండూ చేయలేని మూడోరకం బ్యాచ్ ఉంటుంది. కోరికలను అనుచుకోలేరు.. అలాగని తమ వ్యక్తిత్వాన్ని బయటపెట్టుకోనూ లేరు.. ఇలాంటి వారంతా రాంగ్​ రూట్లో వెళ్లి దెబ్బైపోతుంటారు. ఈ రకానికి చెందిన అదోరకపు మనిషే.. యోషిడో యోడా. ఈ పేరు క్యాచీగా లేకపోతే.. "రెయిన్ కోట్ మ్యాన్" అని గుర్తుపెట్టుకోండి. ఈ బ్రాండ్​ నేమ్​తోనే ఇతగాడు జపాన్​లో ఫేమస్.

దశాబ్ద కాలానికి పైగా రెయిన్​ కోట్లు చోరీ చేస్తున్న యోడా.. చాలా కాలం పాటు న్యూస్ పేపర్ బాయ్​గా పనిచేశాడు. ప్రస్తుతం అతని వయసు 51 సంవత్సరాలు. మరి, అతనికి ఎలాంటి ఆలోచనలు వచ్చాయో.. ఏవిధమైన ఫీలింగ్స్ అనుభవించాడో తెలియదుగానీ.. ఆడవాళ్ల రెయిన్​కోట్లు చోరీ చేయాలని డిసైడ్ అయ్యాడు. అలా.. 2009లో మొదటి సారిగా ఓ రెయిన్ జాకెట్ కొట్టేయాలని ప్లాన్ వేశాడు. టాస్క్ సక్సెస్​ ఫుల్​గా కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత మరొకదాన్ని చోరీ చేశాడు.. ఫుల్ కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇక, అప్పటి నుంచి అవకాశం వచ్చిన ప్రతిచోటా ఎత్తుకెళ్లడం మొదలు పెట్టాడు.

అందమైన ఆడవాళ్లు కనిపించగానే.. వారిని ఫాలో అవుతాడు. ఏళ్లతరబడి సైకిల్​ మీద వెళ్లి, పేపర్ వేసిన అనుభవం ఉంది. దాంతో.. ఎంత దూరమైనా సైకిల్ మీదనే వారిని ఫాలో అవుతుంటాడు. వాళ్లు బైక్ మీదనో.. సైకిల్ మీదనో తమ రెయిన్ జాకెట్ పెట్టి.. ఏదో పనిమీద పక్కకు వెళ్లినప్పుడో.. ఇతరులతో మాటల్లో పడిపోయినప్పుడో.. చాకచక్యంగా లేపేసేవాడు. పొద్దున్నే జాగింగ్ చేసే మైదానాల వద్ద.. ఇతని చోరీలు ఎక్కువగా వర్కవుట్ అయ్యేవి.

చాలా మంది తమ రెయిన్ కోట్లు పోగొట్టుకోవడంతో.. విషయం అందరికీ తెలిసిపోయింది. కానీ.. ఆ విచిత్ర దొంగ ఎవరు? అన్నది మాత్రం తేలలేదు. కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు రిజిస్టర్ చేసుకున్న పోలీసులు.. ఆ రోయిన్ కోట్ మ్యాన్​ కోసం సెర్చింగ్​ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. కానీ.. సంవత్సరాల తరబడి వెతికినా.. నో యూజ్! యోడాను పట్టుకోలేకపోయారు. దీంతో.. 13 ఏళ్లపాటు కంటిన్యూస్​గా దొంగతనాలు కొనసాగించాడు.

ఇన్ని సంవత్సరాల్లో.. వందల రెయిన్ కోట్లు కొట్టేశాడు. కానీ.. చోరీలకు అలవాటు పడ్డ ప్రాణం ఆగుతుందా..? అలా కొనసాగిస్తూనే ఉన్నాడు. బట్.. రోజులన్నీ ఒకేలా ఉండవు కదా.. ఓ లేడీ రెయిన్ కోట్ కొట్టేసేందుకు ప్రయత్నిస్తూ.. బుక్కయ్యాడు! పోలీసులు అతని ఇంటికి వెళ్లి సెర్చ్ చేస్తే.. మొత్తం 360 రెయిన్ కోట్లు బయటపడ్డాయి. ఇవన్నీ చాలా ఖరీదైనవి. వీటి మొత్తం విలువ.. జపాన్ కరెన్సీలో 10 లక్షల పైనే! కానీ.. యోడా వాటిని డబ్బుకోసం అమ్ముకోలేదు. 2009లో చోరీ చేసిన మొదటి రెయిన్ కోట్​ నుంచి.. పట్టుబడడానికి ముందు దొంగిలించిన కోట్ వరకూ.. అన్నీ ఇంట్లోనే దాచుకున్నాడు.

పోలీసులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ 13 ఏళ్ల కాలంలో ఎక్కడా.. ఇళ్లలో చోరీ చేయలేదు. కనీసం పర్సు కూడా దొంగిలించలేదు. ఓన్లీ రెయిన్ కోట్లు మాత్రమే! ఎందుకిలా చేశాడన్నది పోలీసులకు అర్థం కాలేదు. "ఈ జాకెట్లు ఎత్తుకుపోవడం ఏందిరా నాయనా..!" అని ఆ దొంగనే అడిగారు. దానికి ఆ డిఫరెంట్ చోర్ ఏం చెప్పాడంటే.. రెయిన్ కోట్ వేసుకున్న లేడీస్​ను చూస్తే.. లోదుస్తుల్లో ఉన్నవాళ్లను చూసిన ఫీలింగ్ కలుగుతుందట అతనికి! ఎలాగో.. వాళ్లను రియల్​గా అలా చూడలేడు కదా.. అందుకే.. వారు వేసుకున్న రెయిన్​ కోట్లను ఎత్తుకెళ్లి.. అందులో వాళ్లను చూసుకునేవాడట! వేమా.. విన్నావటయ్యా..?! ఇలాంటి వాళ్లను ఏమనాలి..? "దొంగలందు రొమాంటిక్ దొంగలు వేరయా.." అని రాసుకోమందువా..??

వీటిపైనా ఓ క్లిక్కేయండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.