మాస్కు ధరించని వాహనదారులకు ఈ-చలాన్ ద్వారా కూడా జరిమానా విధిస్తున్నట్లు హైదరాబాద్, రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాస్కు ధరించని వారిపై చర్యలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు.
సాధారణంగానే కాకుండా రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా మాస్కులు ధరించని వారిని గుర్తించి సదరు వాహనదారునికి ఈ-చలాన్ విధిస్తున్నామన్నారు. కరోనా ఉదృతి దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ మాస్కు, శానిటైజర్ వాడాలని ఆయన కోరారు. కమిషనరేట్ పరిధిలో నిన్న ఒక్కరోజే మాస్కు ధరించని 832 మందిపై కేసులు నమోదు చేశామి వెల్లడించారు.
- ఇదీ చూడండి: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై సీఎం జగన్ సమీక్ష!