ETV Bharat / city

R&B: ఏడాదిలో.. 9 వేల కిలోమీటర్ల రోడ్ల పునురుద్ధరణ పూర్తి! - ఏపీలో ఒకే ఏడాదిలో 9వేల కి.మీ. మేర రోడ్లు

రాష్ట్రంలో ఒక్క ఏడాదిలో 9 వేల కిలోమీటర్ల మేర రోడ్ల పునరుద్ధరణ పనులు పూర్తి చేశామని ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. రూ.2,205 కోట్లు వెచ్చించి రికార్డు స్థాయిలో రహదారుల పునరుద్ధరణ చేపట్టామన్నారు. మార్చిలోపు పనులు కొలిక్కివస్తాయన్నారు.

krishna babu
krishna babu
author img

By

Published : Jul 28, 2021, 8:34 AM IST

‘ఒకే ఏడాదిలో రూ.2,205 కోట్లతో 9 వేల కి.మీ.మేర రహదారుల పునరుద్ధరణ పనులు చేపట్టడం ఇదే తొలిసారి. ఉమ్మడి రాష్ట్రంలో సైతం ఇంత ఎక్కువ మొత్తం వెచ్చించలేదు' అని రవాణా, ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు. సాధారణంగా రహదారి వేసిన అయిదేళ్ల తర్వాత పునరుద్ధరణ చేయాల్సి ఉండగా, అనేక రహదారులు ఏళ్ల తరబడి అందుకు నోచుకోలేదన్నారు.

‘రాష్ట్రంలో 46 వేల కి.మీ. ఆర్‌అండ్‌బీ రహదారులు ఉండగా, ఏటా సగటున 9 వేల కి.మీ. పునరుద్ధరించాల్సి ఉంటుంది. 2014 నుంచి 2019 వరకు ఏటా రూ.600 కోట్లు చొప్పున మాత్రమే కేటాయించడంతో బ్యాక్‌ల్యాగ్‌ భారీగా పెరిగిపోయింది. చాలాకాలంగా పనులు చేయనివి, నల్లరేగడి నేలలకు దగ్గరగా ఉన్నవి, కాలువలకు దగ్గరగా ఉండే రహదారులు వర్షాలకు త్వరగా దెబ్బతింటున్నాయి. రూ.2 వేల కోట్ల బ్యాంకు రుణం మంజూరవగానే... ఈ పనులకు చెందిన మిగిలిన టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నాం. ప్రస్తుతం వర్షాలకు అధ్వానంగా మారిన వాటికి తొలుత మరమ్మతులు చేస్తాం. డిసెంబరు నుంచి మార్చిలోపు పనులన్నీ పూర్తిచేసేలా లక్ష్యంగా పెట్టుకున్నామని’ ఆయన వివరించారు. ఇవి పూర్తయితే వచ్చే ఏడాది నుంచి వెయ్యి కి.మీ. చొప్పున పనులు చేస్తే సరిపోతుందన్నారు.

రెండేళ్లలో ఎన్‌డీబీ పనులు

న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఎన్‌డీబీ) రుణంతో మండలాల మధ్య కనెక్టివిటీ, మండల కేంద్రాలను జిల్లా కేంద్రాలకు కలిపే రహదారుల విస్తరణ, వంతెనల పనులు రెండేళ్లలో పూర్తి చేయిస్తామని కృష్ణబాబు తెలిపారు. ‘తొలిదశ పనులు మొదలయ్యేందుకు రంగం సిద్ధమవగా.. త్వరలో రెండోదశకు టెండర్లు పిలుస్తాం. ఆర్‌అండ్‌బీలో రూ.6,400 కోట్లతో చేపట్టిన భారీ పనులివి. 2019, సెప్టెంబరులో మంజూరవగా.. వివిధ కారణాలు, టెండర్లు పిలవడం, కొవిడ్‌ కారణంగా పనుల ప్రారంభంలో జాప్యమైందని..’ ఆయన వివరించారు.

ఇదీ చదవండి:

olympics live: భారత హాకీ మహిళా జట్టు ఓటమి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.