ETV Bharat / city

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఏ అర్హతలుండాలి? - 2021 ఏపీ పంచాయతీ ఎన్నికలు వార్తలు

ఎన్నికలు జరుగతాయో లేదో అన్న అనుమానాలు... సుప్రీం కోర్టు తీర్పుతో నివృతి అయ్యాయి. ఇక స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం అయ్యింది. అధికారులు, ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే... అసలు సర్పంచి, వార్డు సభ్యులుగా పోటీ చేయటానికి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులో తెలుసుకోండి

qualifications for sarpanch and ward member candidates
పంచాయతీ ఎలెక్షన్లు
author img

By

Published : Jan 27, 2021, 7:25 AM IST

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది. సర్పంచి, వార్డు సభ్యులుగా పోటీ చేయడానికి గ్రామాల్లో చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. పోటీ చేయాలనుకుంటున్న వారికి ఏయే అర్హతలు ఉండాలి? ఎవరు అనర్హులవుతారు? తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఓ కరదీపిక ప్రచురించింది. అందులోని ప్రధానాంశాలు..

అర్హతలివే..
* అభ్యర్థులు ఏ పంచాయతీ పరిధిలో పోటీ చేయదలిచారో.. అక్కడి ఓటర్ల జాబితాలో వారి పేరు నమోదై ఉండాలి.
* పోటీ చేయదలిచిన అభ్యర్థుల వయసు నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి 21 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదు.
* ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వారికి రిజర్వు చేసిన స్థానాల్లోనే కాకుండా అన్‌రిజర్వుడు స్థానాల నుంచి పోటీ చేయొచ్చు.
* మహిళా అభ్యర్థులు అదే కేటగిరిలో జనరల్‌ స్థానాల్లోనూ పోటీ చేయొచ్చు.

వీరు అనర్హులు..
* గ్రామసేవకుడు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల, ఎయిడెడ్‌ సంస్థల ఉద్యోగులు, చట్టాల ద్వారా ఏర్పడిన ఏదైనా సంస్థకు చెందిన పాలక మండలి సభ్యులు అనర్హులు.
* నీతిబాహ్యమైన నేరానికి పాల్పడ్డారని రుజువై, శిక్ష పడినవారు.. ఆ శిక్షా కాలం ముగిసిన తేదీ నుంచి ఐదేళ్లపాటు పోటీకి అనర్హులు.
* పౌర హక్కుల పరిరక్షణ చట్టం-1955 పరిధిలోకి వచ్చే నేరాల్లో శిక్షపడినవారు.
* మతి స్థిమితం లేని వారు, బధిరులు, మూగవారు.
* దివాలాదారుగా న్యాయ నిర్ణయం కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి, రుణ విమోచన పొందని దివాలాదారు.
* గ్రామ పంచాయతీ తరఫున లీగల్‌ ప్రాక్టీషనరుగా నియమితుడై పంచాయతీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి.
* గ్రామ పంచాయతీకి ధర్మకర్త హోదాలో కాకుండా వ్యక్తిగతంగా బకాయిపడి ఉన్న వ్యక్తికి దాన్ని చెల్లించాలని నోటీసు జారీ చేసినా ఆ గడువులోగా చెల్లించకపోయినప్పుడు అనర్హుడవుతారు.
* ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్నవారు. (1994 ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం అమలు తేదీ నుంచి ఒక సంవత్సరం లోపల జన్మించిన అదనపు శిశువును పరిగణనలోకి తీసుకోకూడదు. ఈ చట్టం అమలు తేదీ నాటికి ఒక వ్యక్తికి ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండొచ్చు.)
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ఏదైనా స్థానిక సంస్థ ఆధీనంలోని కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తి అవినీతికి పాల్పడి లేదా విశ్వాసఘాత నేరాల కింద తొలగించినట్లయితే ఆ తేదీ నుంచి ఐదేళ్ల కాలపరిమితి వరకూ అనర్హులే.
* గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలో కాంట్రాక్టు చేసుకున్న లేదా ఏదైనా పనికి నిర్వహణ ఒప్పందం చేసుకున్న వ్యక్తులు అనర్హులవుతారు.

ఇదీ చదవండి:

నేడు గవర్నర్​తో ఎస్ఈసీ భేటీ.. ఎన్నికల ఏర్పాట్లపై చర్చ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.