తెలంగాణలోని కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని ఇస్మాయిల్ అనే వ్యక్తి ఇంట్లోకి పెద్ద కొండ చిలువ ప్రవేశించింది. దీనితో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే పాములు పట్టే వ్యక్తి సాయిలుకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న సాయిలు.. కొండచిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశాడు. కాలనీకి ఆనుకోని గుట్ట ఉండటం వల్ల తరచూ.. అడవి పందులు, పాములు వస్తున్నా.. పంచాయతీ అధికారులు, అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: విశాఖ సాగర తీరంలో యువకుల సర్ఫింగ్ విన్యాసాలు..