pulse polio : రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్లలోపు ఉన్న చిన్నారులందరికీ నేటి నుంచి పోలియో చుక్కల పంపిణీ జరగనుంది. అన్ని పీహెచ్‌సీలు, సామాజిక, ప్రాంతీయ, అంగన్‌వాడీలు, గ్రామ సచివాలయాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఇతర ముఖ్య కూడళ్లలో పోలియో చుక్కల పంపిణీ జరుగుతుంది. సోమ, మంగళవారాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఇంకా టీకా వేయాల్సిన చిన్నారులు ఉంటే వారికీ వేస్తారు. నాలుగో రోజు విజయవాడ, గుంటూరు, కర్నూలు, విశాఖ, రాజమహేంద్రవరం, కాకినాడ కార్పొరేషన్ పరిధిలో టీకాకు దూరంగా ఉన్న వారిని గుర్తించి పంపిణీ చేసేలా జిల్లాలకు ఆదేశాలు వెళ్లాయి. ప్రత్యేక ప్రదేశాల్లో నివసించే సంచార జాతుల కుటుంబాలకు చెందిన చిన్నారులకు చుక్కలు పంపిణీ చేసేందుకు 1,374 బృందాలు వాహనాల ద్వారా పర్యటిస్తాయి. టీకా పంపిణీకి రూ.7 కోట్ల వరకు వ్యయంకానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో ఈ ఖర్చును భరిస్తున్నాయి.
ఇదీ చదవండి: ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు.. ఆందోళనలో తల్లిదండ్రులు